MoviesTollywood news in telugu

సమంతా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన చైతు…షాక్ లో నాగ్…?

Samantha and naga Chaitanya :హీరోయిన్ గా దుమ్మురేపి, అక్కినేని వారి కోడలు అయ్యాక కూడా సినిమాలతో బిజీగానే ఉంటూ మరోపక్క ఆహా ఓటిటి ద్వారా సమంత తన సత్తా చాటుతోంది. భర్త నాగచైతన్య కన్నా ఫాస్ట్ గా టాలీవుడ్ లో దూసుకెళ్తోంది. అంతేకాదు, సామ్ జామ్ అనే షో సమంత హోస్టింగ్ తో నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమన్నా‌‌ వంటి పలువురు స్టార్ లను పిలిచి, అద్భుతమైన విషయాలను రాబడుతోంది. తాజాగా తన భర్త నాగచైతన్యను ఇంటర్యూ చేసింది. ఈ నెల 8 న ఈ ఎపిసోడ్ ప్రసారమవుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మంచి మూడ్ లో ఉన్నందున వంటకు ఎన్ని మార్కులు వేస్తావని ప్రశ్నించగా. నేను ఎప్పుడూ మంచి మూడ్ లోనే ఉంటానని నాగచైతన్య చెప్పాడు. ఏంటి కుకింగ్ నువ్వా అని అన్నట్లు కాసేపు సరదా పట్టించాడు. ఈ షో లో గెస్ట్ అయినా నువ్వు నన్ను ర్యాగ్ చేయలేవు అని సామ్ అంటే ఈ గెస్ట్ కు నీ గురించి అన్నీ తెలుసు” అని కౌంటర్ ఇచ్చాడు. ఈ షోలో సమంత తన భర్త నాగచైతన్య చేయి పట్టుకొని ఆహ్వానిస్తూ.. ప్రోమో విడుదల అవ్వడంతో వైరల్ గా మారింది.

‘‌ఫైనల్లీ యు ఆర్ ఆన్ ది సామ్ జామ్’ అంటూ సమంత స్టార్ట్ చేయగా, వెంటనే నాగచైతన్య ‘వీడు ఇంట్లోనే ఉంటాడని , ఎప్పుడైనా వస్తాడని లాస్ట్ లో నన్ను పిలిచావు’ అని కొంటెగా కామెంట్ చేశాడు. ‘హోస్ట్ గా నాకు ఎన్ని పాయింట్లు ఇస్తావు’ అని సామ్ ప్రశ్నించగా, అడ్వైస్ ఇస్తే తీసుకుంటావా? అసలు ఇంట్లో ఏ అడ్వైస్ తీసుకోవుగా” అంటూ నాగచైతన్య అనడంతో సిగ్గులొలికింది. ‘ఒకే సమయంలో మల్టిపుల్ గర్ల్స్ తో ఫ్లర్ట్ చేశావా? అని ప్రశ్నించగా ,ఏదో ఒక రోజు నువ్వు తప్పు చేసి నావల్ల అని మాత్రం చెప్పద్దని ’ నాగచైతన్య అన్నాడు. మొత్తానికి రొమాంటిక్ లెవెల్లో ఇంటర్య్వూ ప్రోమో సాగింది.