BusinessPoliticsSports

ధోని ఎన్ని కోట్ల ఆస్థిని సంపాదించాడో తెలుసా?

dhoni net worth :టీమిండియా క్రికెట్ చరిత్రలో విజయానైకి సంకేతంగా చెప్పుకునే కెప్టెన్ గా ఎం ఎస్ ధోనీ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా పనిచేస్తున్నాడు. ఇందుకు గాను, ధోనీకి చెన్నై ఫ్రాంచైజీ ప్రతి ఏడాది 15 కోట్ల రూపాయల్ని చెల్లిస్తోంది. 2014, 15లో ఫోర్ట్స్ టాప్ 100 అథ్లెట్స్ లిస్ట్ లో స్థానం పొందిన ఒకే ఒక ఇండియన్ గా ధోనీ అని చెప్పాలి. ఇక లేటేస్ట్ గా సేంద్రీయ వ్యవసాయంలోకి అడుగుపెట్టాడు. అలాగే కడక్ నాథ్ కోళ్ల ఫామ్ లను కూడా ప్రారంభించాడు. ధోనీ తన ఫామ్ హౌస్ లో పండించే కూరగాయలు ఇప్పుడు దుబాయ్ కి కూడా ఎగుమతి చేస్తున్నాడు.

క్రికెట్ ఆటలో కీలక సమయాల్లో అద్భుతమైన నిర్ణయాలతో జట్టును గెలిపించే ధోనీ మిగతా ఆటగాళ్ల కన్నా ప్రత్యేకమైన శైలి గల ప్లేయర్. కేవలం క్రికెట్ పరంగా మాత్రమే కాకుండా డబ్బు సంపాదన, ఆదాయం వంటి అంశాల్లో కూడా ధోనీ ధోరణి విభిన్నంగా ఉంటుంది. ఇక ధోనీకి బైక్స్ అంటే చాలా ఇష్టం. అందుకే చాలా బైక్స్‌, కార్లు కొన్నాడు. అలాగే మహీ రేసింగ్ టీమ్‌ను కలిగి ఉన్నాడు. అక్కినేని నాగార్జున కూడా ఈ టీమ్‌లో భాగస్వామ్యం ఉంది. రాంచీ రేజ్ పేరిట హాకీ టీమ్‌ కూడా ఉంది.

గోడాడీ, స్నైకర్స్, వీడియోకాన్, బూస్ట్, ఓరియెంట్ ఎలక్ట్రిక్, నెట్‌మెడ్స్ వంటి చాలా కంపెనీ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ధోనీవ్యవహరిస్తున్నాడు. అలాగే స్పోర్ట్స్ ఫిట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ధోనీకి కంపెనీ కూడా ఉండడంతో పాటు దీనికిఇందా దేశవ్యాప్తంగా 200 జిమ్‌లు ఉన్నాయి. అంతేనా, ఝార్ఖండ్‌లో హోటల్ మహి రెసిడెన్సీ పేరుతో పెద్ద హోటల్ కూడా ఇతడి సొంతం. కాగా క్రికెట్ లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న జార్ఖండ్ డైనమైట్ ధోనీ గతేడాది ఆగస్ట్ 15 న క్రికెట్ కు గుడ్ బై చెప్పడంతో అతని ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు.