PoliticsSports

గంగూలీ పై ద్రవిడ్ కు చిర్రెత్తుకొచ్చింది.. అంతే ధోనీ ఎంటరైపోయాడు.

Ganguly and dravid :అంతర్జాతీయ క్రికెట్ లోకి ధోనీ ఎంట్రీ కథ కొంచెం విచిత్రం గా ఉంటుంది. అదేమిటంటే.., భారత జట్టు వికెట్ కీపర్.. కిరణ్ మోరే.. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయాక, తరువాత భారత జట్టు వికెట్ కీపర్ గా కీపింగ్, బ్యాటింగ్ రెంటిలోనూ విఫలమవుతూ ఎవరూ సరిగా నిలదొక్కు కోలేని పరిస్థితులున్న రోజులవి. గంగూలీ టీమ్ ఇండియా కెప్టెన్ అయాడు. టీమ్ ఇండియా కు సెలెక్ట్ అయిన వికెట్ కీపర్ జట్టుకు భారమౌతున్న పరిస్థితుల్లో, రంజీ మ్యాచ్ ల్లో అపుడపుడూ వికెట్ కీపర్ పాత్ర పోషించిన మోస్ట్ డిపెండబుల్ బ్యాట్స్ మన్ రాహుల్ ద్రవిడ్ వైపు గంగూలీ చూపు మరలింది. అంతే, ఇక ఇష్టం లేకపోయినా రాహుల్ ద్రావిడ్ కష్టం గానే వికెట్ కీపర్ బాధ్యత తడబడుతూ పోషించాడు.

ఇలా తడబడుతూ వికెట్ కీపర్ పాత్ర పోషించడం రాహుల్ ద్రావిడ్ కు చిరాకు తెప్పించింది. ఇహ టీమ్ ఇండియా కు మంచి వికెట్ కీపర్ వెతికే బాధ్యత తనకు తనే తీసుకుని, దేశవాళీ క్రికెట్ పై ఓ కన్నేసి ఉంచాడు.

ఆ సమయం లో దేశవాళీ క్రికెట్ లో రాణిస్తున్న ధోనీ, ద్రవిడ్ దృష్టి లో పడ్డాడు. ఆ వెంటనే ద్రవిడ్ క్రికెట్ బోర్డ్ పెద్దల దృష్టి కు చెరవేసాడు.

ఆ తదుపరి ధోనీ వికెట్ కీపర్ గా టీమ్ ఇండియా లో చోటు సంపాదించడం.. అలా ఇక ఆ తరువాత కథ మీకు తెలిసిందే.