చిత్తూరు జిల్లా లో జల్లికట్టు లో కుమ్మేస్తున్న జూ ఎన్టీఆర్..
junior ntr jallikattu :సంక్రాంతి పండుగ సందర్భంగా, పోలీసుల, కరోనా నిబంధనలు అన్నిటినీ బేఖాతరు చేస్తూ.. చిత్తూరు జిల్లా లో జల్లికట్టు పోటీలు జోరు గా సాగుతున్నాయి.
పోట్లగిత్త లకు రకరకాల అలంకారాలు తో ముస్తాబు చేసి బరిలోకి దింపి వాటిని నిలువరించే ప్రయత్నం చేస్తారు. దేవుని పటాలు తో కూడా అలంకరిస్తారు.
అయితే ఈ సారి జూ ఎన్టీఆర్ అభిమానులు మామూలుగా సందడి చేయలేదు మరి. జూ ఎన్టీఆర్ ఫోటోలతో జల్లికట్టు పోటీలలో తమ పౌరుషాన్ని చాటారు. పోట్ల గిత్తల ను జూ ఎన్టీఆర్ ఫోటోలతో అలంకరించారు. ఆ గిత్తలు పౌరుషం తో ముందుకు దూకుతుంటే అభిమానులు కేరింతలు కొట్టారు. జూ ఎన్టీఆర్ పౌరుషం ఆ గిత్తలలో అభిమానులు చూసుకున్నారు. ఇదంతా ఇపుడు సోషల్ మీడియాలో లో వైరల్ గా మారింది.