కంటి కింది భాగంలో నల్లటి వలయాలు పోవాలంటే….
How To Remove Dark Circles :ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరు కంటి కింద నల్లని వలయాలతో ఇబ్బందులు పడటం సాధారణం అయింది. కొన్ని సాధారణ ఇంటి చిట్కాలతో చాలా సులభంగా బయట పడవచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
కంటి కింది భాగంలో తేనెను రాసి, పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తే నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి.
ఒక బౌల్ లో ఒక స్పూన్ టమోటా పేస్ట్, ఆర స్పూన్ నిమ్మరసం,చిటికెడు పసుపు, చిటికెడు పెసర పిండి వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని కళ్ళ చుట్టూ రాసుకొని 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.
ప్రతి రోజు పడుకొనే ముందు బాదం ఆయిల్ కళ్ళ చుట్టూ రాసుకొని మసాజ్ చేసుకోవాలి.
పుదీనా రసాన్ని కళ్ళ చుట్టూ రాసుకొని, ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.
కీరదోస ముక్కలను కళ్ళ మీద పెట్టుకొని 15 నిమిషాల తర్వాత తీసేస్తే మంచి ఫలితం కనపడుతుంది.
బంగాళాదుంప రసాన్ని కళ్ళ చుట్టూ రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.