ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా…ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా… ?
Telugu actress vimala raman :’ఎవరైనా ఎప్పుడైనా’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్ బ్యూటీ విమలారామన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదట్లో వరుస అవకాశాలు వచ్చినా కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయం తీసుకోక పోవటం తో ఎక్కువ కాలం టాలీవుడ్ లో కొనసాగలేదు. ఆ సమయంలో లో డాన్స్ మీద దృష్టి పెట్టి అనేక ప్రదర్శనలు ఇచ్చింది.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటుంది. రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందట. దాని కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. 38 ఏళ్ల విమలారామన్ తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషలలో దాదాపు ఇరవైకి పైగా సినిమాల్లో నటించింది. తెలుగులో చివరగా ఓం నమో వెంకటేశాయ సినిమా లో శ్రీదేవి పద్మావతి పాత్రలో కనిపించింది