YouTuber అత్యుత్సాహం దెబ్బకు ఒక Restaurant మూతపడే స్థితికి..
తమ ఛానల్ subscribers పెరగడానికి తమ videos యొక్క views పెరగడానికి YouTubers తెగ తాపత్రయ పడుతుంటారు.
ఆ తాపత్రయం ఒక రెస్టారెంట్ దుంప తెంచింది.
సౌత్ కొరియా లో ఒక YouTuber రెస్టారెంట్లు అక్కడి ఆహారపదార్ధాల పై రివ్యూ లు ఇస్తూ ఉంటాడు తన ఛానెల్ లో. ఇతడి ఛానల్ కు 7లక్షల పైనే subscribers ఉన్నారు.
ఇటీవల అక్కడ అతను ఓ రెస్టారెంట్ కు వెళ్ళి పలు ఆహార పదార్థాలను ఆర్డర్ ఇచ్చాడు. వాటిని రుచి చూస్తుండగా, అక్కడక్కడా వాటికి అన్నం మెతుకులు అంటుకుని కనబడ్డాయి. అంతే మనోడికి కాలిపోయి, ఎవరో తిన్న అన్నం మెతుకులు తిరిగి వీటితో కలిపేసి వడ్డిస్తున్నారు అని దారుణమైన రివ్యూ ఇచ్చేశాడు.
ఆ వీడియో కాస్తా వైరల్ అయి మిలియన్ వ్యూస్ పైనే వచ్చాయి. నెటిజన్లు ఆ రెస్టారెంట్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ దెబ్బకు రెస్టారెంట్ మూతపడింది.
ఆ రెస్టారెంట్ యాజమాన్యం తాము అలా చేయమని కావాలంటే వీడియో ఫుటేజ్ చూపుతామని వివరణ ఇచ్చినా ఫలితం శూన్యం.
అయితే ఆ రెస్టారెంట్ వారి వీడియో ఫుటేజ్ మన YouTuber కు కనబడింది. ఆ ఫుటేజ్ లో తన ప్లేట్ లో అంతకు ముందు తాను తిన్న పదార్థం బాపతు అన్నం మెతుకులు మళ్ళీ వడ్డించిన వేరే పదార్థాలకు అంటుకున్నాయి అని గ్రహించాడు.
దాంతో అతను రెస్టారెంట్ యాజమాన్యానికి క్షమాపణ చెప్పి, మరొక వీడియో తీసాడు జరిగిన తప్పిదం తెలుపుతూ, రెస్టారెంట్ యాజమాన్యానికి క్షమాపణ చెబుతూ. కానీ అప్పటికే ఎంతో నష్టపోయింది ఆ రెస్టారెంట్. ఇపుడు నెటిజన్లు ఆ వీడియో చూసి YouTuber ను తిట్టి పోశారు. ఆ రెస్టారెంట్ యజమాని ఇలాంటి YouTubers ను కంట్రోల్ చేసే చట్టం తీసుకు రావాలంటూ ఒక పిటిషన్ దాఖలు చేశాడు.