రోజా, రామ్ చరణ్ ల కామన్ అభిమాన హీరో ఎవరంటే..
Roja And Ram Charan :ముక్కుసూటిగా వ్యవహరించే రోజా.. అటు రాజకీయాల్లోనూ, ఇటు జబర్దస్త్ స్టేజ్ మీద తనదైన మార్క్ చూపుతుంది. చాలా సార్లు జబర్దస్త్ స్టేజ్ పై, గాలిపటాల సుధాకర్, భాస్కర్ వంటి వారు సూపర్ స్టార్ కృష్ణ ను చక్కగా ఇమిటేట్ చేసినపుడు, రోజా బాగా ఎంజాయ్ చేస్తుంది ఆ కామెడీ ను. అలాంటి సందర్భాలలో కొన్నిసార్లు చెప్పింది కూడా, తాను చిన్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ అభిమానిని అని.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో ఇపుడు మీ అభిమాన హీరో ఎవరు అని అడిగితే, రవితేజ ఇష్టమని చెప్పింది. అతని ప్రతి సినిమా వదలకుండా చూస్తాను అని చెప్పింది. ఏమైనా చిరంజీవి తరువాత అంత మాస్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో రవితేజ మాత్రమే. మొన్న రామ్ చరణ్ కూడా తన అభిమాన హీరో రవితేజ Krack సినిమా చూసి బాగా ఎంజాయ్ చేశా అని చెప్పాడు కూడా..