Healthhealth tips in telugu

కొలెస్ట్రాల్‌ నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలు

cholesterol control tips in telugu :ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలికి అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. వాటిలో ప్రధానంగా కొలస్ట్రాల్ చెప్పవచ్చు. అయితే కొలస్ట్రాల్ నియంత్రణలో ఉండాలంటే మందుల అవసరం లేకుండా కొన్ని జాగ్రత్తలను పాటిస్తే సరిపోతుంది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్‌ నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలు:
1. వ్యాయామం:- నడక వలన HDL మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెంచుకోవచ్చు.

2. ప్రాణాయామం: – 15 నిమిషాల పాటు ప్రాణాయామం చేయటం వలన శ్వాసవ్యవస్థ శుభ్రపడుతుంది.

3. నీరు: రోజుకి సగటున 6-8 గ్లాసుల నీరు త్రాగాలి.

4. ఆల్కహాల్, మాంసాహారసేవన, సిగరెట్లు మానివేయాలి.

5. బరువును పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదుగల ఆహారం తీసుకోవాలి.

6. పీచు కలిగిన పండ్లు, కూరగాయలు, ఆహారం, ఓట్స్ తీసుకోవటం వలన కొలెస్ట్రాల్‌ను పూర్తిస్థాయిలో నియంత్రించవచ్చు.