‘ప్రేమ ఎంత మధురం నటుడు’ నీరజ్ రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడో తెలుసా?
Prema entha madhuram serial actor neeraj : జి తెలుగులో విజయవంతంగా నడుస్తున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఇక ఈ సీరియల్ లో నటుడు నీరజ్ తన అమాయకపు నటనతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఇతడి అసలు పేరు విజె కరం. ఆగస్టు 12న పుట్టాడు.
చిన్న నాటి నుంచి నటనా రంగంపై ఆసక్తి ఉండడంతో పలు షోస్ కి యాంకర్ గా చేసాడు. జెమినిలో వచ్చే పకోడీ వార్తలు, కిరాక్ కామెడీ, తొట్టిగ్యాంగ్, పంచ్ పడుద్ది, అన్నా నాకో డౌట్ వంటి షోస్ కి యాంకర్ గా విజె కరం వర్క్ చేసాడు.
ఓ పక్క యాంకర్ గా చేస్తూనే మరోపక్క వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ లో చేసాడు. ఇద్దరమ్మాయిలతో ఇద్దరబ్బాయిలతో వంటి షార్ట్ ఫిలిమ్స్ చేసాడు. ఒక నందనం వంటి వెబ్ సిరీస్ లో నటించాడు. కాళీ దీపారాధన వంటి సీరియల్స్ లో నటిస్తూ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు.