పొడి దగ్గు తగ్గాలంటే ఈ టీ ట్రై చేయండి…Best Tip
Tulsi tea benefits :ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో పొడి దగ్గు అనేది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది పొడి దగ్గు వచ్చింది అంటే చాలా చిరాకుగా ఉంటుంది. ఈ కాలంలో చలి మంచు రెండు ఎక్కువగానే ఉన్నాయి వీటి కారణంగా పొడి దగ్గు వస్తుంది. మనలో చాలా మంది పొడిదగ్గు రాగానే టాబ్లెట్స్ టానిక్ అంటూ వాటి వైపు వెళ్ళి పోతూ ఉంటారు. అయితే మందుల జోలికి వెళ్లకుండా ఇంటిలో ఉండే తులసి ఆకులతో చెక్ పెట్టవచ్చు తులసి ఆకులతో తయారుచేసిన టీ తాగితే ఉపశమనం కలుగుతుంది.
అయితే తులసి టీ ని ఎలా తయారు చేయాలో చూద్దాం. గుప్పెడు తులసి ఆకులను తీసుకుని శుభ్రంగా కడగాలి ఒక గ్లాసు నీటిని పొయ్యి మీద పెట్టి తులసి ఆకులు, చిన్న అల్లం ముక్క 2 మిరియాలు పొడి చేసి వేయాలి బాగా మరిగించి వడకట్టి తాగాలి. రోజులో రెండు సార్లు ఈ టీ తాగితే పొడి దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది ఈ టీ తాగడం వలన డయాబెటిస్ ఉన్నవారికి చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి.అలాగే డిప్రెషన్, ఒత్తడి, ఆందోళన, తలనొప్పి వంటి సమస్యలను నివారించడంలోనూ తులసి టీ గ్రేట్‌గా సహాయపడుతుంది.