MoviesTollywood news in telugu

సముద్రఖని గురించి ఎవరికి తెలియని నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు

Actor samuthirakani :గత ఏడాది సంక్రాంతికి విడుదలైన అలవైకుంఠపురంలో మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడమే కాదు, హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ జోడీకి హ్యాట్రిక్ లభించింది. ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఈ మూవీలో అందరికీ మంచి పేరు వచ్చింది. ఇక అప్పలనాయుడు పాత్రవేసిన సముద్రఖని కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నిజానికి గతంలో తెలుగు సినిమాలు చేసినప్పటికీ అలవైకుంఠపురంలో మూవీతోనే క్రేజ్ రావడంతో చాలామంది తమ సినిమాల్లో సముద్రఖని ఉంటె బాగుటుందని భావిస్తున్నారు. తమిళంలో మూడు టీవీలకు డైరెక్టర్ గా నెలంతా బిజీగా గడిపిన సందర్భాలున్నాయి.

సినిమాల్లో నటించడం కోసం టివి ప్రోగ్రామ్స్ ని కో డైరెక్టర్స్ కి అప్పగించాడు. తమిళంలో సుబ్రహ్మణ్యపురం మూవీతో మంచి గుర్తింపు తెచ్చు కున్నాడు. అయినా సరే, కె బాలచందర్ దగ్గర అసిస్టెంట్ గా చేరి, మరిన్ని మెళుకువలు నేర్చుకున్నాడు. తాజాగా ఈ సంక్రాంతికి రిలీజైన రవితేజ క్రాక్ మూవీలో కూడా సముద్రఖని విలనిజంలో ఆకట్టుకున్నాడు. కటారి కృష్ణగా విలనిజం పండించి సినిమా విజయంలో కీలక పాత్ర వహించాడు. రవితేజతో శంభో శివ శంభో సినిమాలో కూడా యితడు రవితేజతో కల్సి చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు.

సముద్రఖని ప్రస్తుతం అగ్ర దర్శకుల డైరెక్షన్ లో ఇటు తెలుగు, అటు తమిళంలో నటిస్తున్నాడు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ , తమిళంలో భారతీయుడు 2, వంటి మూవీస్ లో సముద్రఖని చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు సినిమాలు లేకుండా ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని ఇప్పుడు చేతినిండా సినిమాలే ఉన్నాయని ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పాడు. న్యూ యియర్ , బర్త్ డే లకు ఒక్క మెసేజ్ గానీ, ఫోన్ గానీ వచ్చేది కాదని, ఇప్పుడు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయని, అందుకే విజయానికి, అపజయానికి పొంగిపోకూడదని భావిస్తున్నట్లు సముద్రఖని చెప్పుకొచ్చాడు.