రామ్ రాబర్ట్ రహీం సినిమా గురించి నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…?
Ram Robert Rahim Telugu Full Movie :బాలీవుడ్ లో 1977లో విడుదలై ఘనవిజయం సాధించిన అమర్ అక్బర్ అంథోని సినిమా అప్పట్లో ఓ సంచలనం. మాస్ ఎలిమెంట్స్ జోడించి కమర్షియల్ గా తీర్చిదిద్దిన ఈ మూవీ కి గాను ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు. హయ్యస్ట్ గ్రాసర్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో రీమేక్ హక్కుల కోసం తన బావమరిది యు సూర్యనారాయణ బాబుకి కృష్ణ పురమాయించారు. అప్పటికే ఆయన 20వరకూ మూవీస్ వివిధ భాషల్లో తీశారు.
కృష్ణతోనే కాకుండా రమేష్ బాబు, మహేష్ బాబు లతో కూడా సూర్యనారాయణ బాబు సినిమాలు తీశారు. మనుషులు చేసిన దొంగలు, దొంగల దోపిడీ మూవీస్ తర్వాత కృష్ణతో మూడవ సినిమాగా రామ్ రాబర్ట్ రహీం మూవీ తీశారు. చాలామందికి రీమేక్ చేసే ముందు ఒరిజనల్ మూవీ చూడడం కొందరికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ హీరో కృష్ణకు అలాంటి భయం లేదు. రీమేక్ ముందు సినిమా చూడడం ఆయన అలవాటు. నిర్మాత మేలు కోరే వ్యక్తిగా ఓ బాధ్యతతో ఇలా చూసేవారు. యాక్షన్ పార్ట్ ఎక్కువ గల ఈ మూవీకి విజయనిర్మల డైరెక్షన్ చేయడం విశేషం. రామ్ పాత్రకి రజనీకాంత్ ని అడిగిన వెంటనే ఒకే చెప్పారు. రహీం పాత్రకు చంద్రమోహన్ ని సెలెక్ట్ చేసారు.
రాబర్ట్ పాత్రను కృష్ణ వేశారు. రజనీ సరసన సునీత, కృష్ణ సరసన శ్రీదేవి, చంద్రమోహన్ సరసన జయలక్ష్మి నటించారు. 1979అక్టోబర్ 29న వాహిని స్టూడియోలో షూటింగ్ స్టార్ట్. బడ్జెట్ పెరగడంతో 22లక్షలతో ఈ సినిమా పూర్తయింది. 1980మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్బంగా27సెంటర్స్ లో రిలీజ్ చేసారు. ఓపక్క భారీ వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. వర్షాలను ఎదుర్కొని వారం రోజుల్లో 32లక్షల 16వేల 244రూపాయలు వసూలు చేసింది. ఇక 13సెంటర్స్ లో తమిళ వెర్షన్ రిలీజ్ చేసారు. రెండు చోట్లా విజయం సాధించింది.