Healthhealth tips in telugu

వారంలో పొట్ట తగ్గాలంటే….ఏమి చేయాలి?

weight loss tips in telugu :ఇటీవల కాలంలో మారిన జీవనశైలి కారణంగా మనం తినే ఆహారంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. అందువల్ల ఆ ప్రభావం పొట్ట మీద పడి పొట్ట పెరగటానికి కారణం అవుతుంది. పొట్ట పెరగటం వలన మన శరీర ఆకృతి కూడా అసహ్యంగా కనపడుతుంది.

అంతేకాకుండా వేసుకున్న దుస్తులు కూడా అందంగా ఉండవు. ఈ పరిస్థితి నుండి బయట పడటానికి కొన్ని చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది.

ప్రతి రోజు 7 నుంచి 8 గ్లాసుల మంచి నీటిని త్రాగటం అలవాటుగా చేసుకోవాలి. శరీరానికి తగినంతగా నీరు అందితే శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. అంతేకాక పొట్ట తగ్గటానికి కూడా సహాయపడుతుంది.

గ్రీన్ టీ త్రాగటం వలన వలన వాటిలో సమృద్ధిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ పొట్ట పెరగకుండా సహాయపడతాయి.

అల్లం కూడా పొట్ట తగ్గటంలో సహాయపడుతుంది. అల్లంను తురిమి గ్రీన్ టీలో వేసుకొని త్రాగవచ్చు. అంతేకాక అల్లం గ్యాస్ తగ్గించటానికి కూడా సహాయపడుతుంది.

పొటాషియం సమృద్ధిగా లభించే అరటి,బొప్పాయి,పెరుగు వంటి వాటిని ఆహారంలో తీసుకుంటే పొట్టను తగ్గించటంలో సహాయపడటమే కాకుండా కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి.

పచ్చి కూరలను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎందుకంటే ఇవి జీర్ణం కావటానికి పొట్ట మీద అధిక భారం పడుతుంది.

మనం ప్రతి రోజు మూడు సార్లు తీసుకొనే ఆహారాన్ని ఐదు సార్లు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అంతేకాక జీర్ణక్రియ కూడా బాగా జరిగి పొట్ట ప్రాంతంలో కొవ్వు కరగటానికి సహాయపడుతుంది.

ఈ విధంగా ప్రతి రోజు చేస్తే పొట్ట తగ్గటమే కాక బరువు కూడా తగ్గవచ్చు.