ఒకప్పటి సీరియల్ తారలు ఇప్పుడు ఎక్కడ ఏమి చేస్తున్నారో?
old telugu serial actresses :ఇప్పుడే కాదు, ఒకప్పుడు కూడా సినిమాలతో సమానంగా సీరియల్స్ దుమ్మురేపాయి. అందులో దూరదర్శన్ లో వచ్చే ఋతురాగాలు సీరియల్ అంటే జనం విరగబడి చూసేవారు. సాయంత్రం అయితే చాలు టివి ముందు వాలిపోయే వారు. ఇక పలు చానల్స్ రంగప్రవేశం చేసాక … అలౌకిక, అంతరంగాలు, అన్వేషిత, చక్రవాకం వంటి ఎన్నో సీరియళ్లు తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. సీరియల్స్ పాత్రల్లో ఆడియన్స్ లీనమైపోయి, కన్నీళ్లు కూడా పెట్టుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. అంతేకాదు, తరవాత ఎపిసోడ్ లో ఏం జరగబోతుందోనని ఆలోచించి చుట్టుపక్కల వాళ్లతో కూడా చర్చలు కూడా బాగానే సాగేవి. కానీ కాలం మారుతున్న కొద్దీ సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ప్పటికీ వీటి గురించి చర్చించుకునేంత టైం ఉండడం లేదు.
ఎందుకంటే ఏ ఛానల్ లో చూసిన సీరియల్స్ వరదలా, ఏళ్లకు ఏళ్ళు ధారావాహికంగా సాగిపోతున్నాయి. దీనికి తోడు వాట్సాప్, ఫేస్ బుక్ లతో స్మార్ట్ కాలక్షేపాలు సరాసరి. అయితే ఎన్నో ఏళ్ల పాటు అలరించిన నటీనటులు సదరు సీరియల్స్ ముగియడంతో కనిపించకుండా పోయారు. అలాంటివారిలో కొందరి గురించి పరిశీలిస్తే, … పవిత్ర బంధం, మెట్టెల సవ్వడి, కల్యాణి వంటి సీరియళ్ళలో నటించిన గాయత్రి తెలుగు బుల్లితెర ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపో యారు. అయితే ఇప్పుడు ఆమె నటనా రంగానికే పూర్తిగా దూరంగా ఉన్నారు. చక్రవాకం సీరియల్ లో స్రవంతి పాత్రలో నటించిన ప్రీతి అమీన్ నటనకు మెచ్చి బోల్డంతమంది ఫ్యాన్స్ గా మారిపోయారు. అయితే 2014 లో ఈ ముద్దుగుమ్మ లియోనెల్ పెరీరా అనే డాక్టర్ ని పెళ్లి చేసుకొని స్థిరపడ్డారు.
ఇక యాంకర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసిన లిఖిత కామిని యువర్స్ లవింగ్లీ అనే ఓ జెమిని కార్యక్రమంలో మంచి పేరు తెచ్చుకుంది. అయితే బుల్లితెర సీరియళ్లలో దాదాపు పది సంవత్సరాల పాటు కొనసాగారు. 2008 నుంచి 2013 వరకు ప్రసారమైన మొగలిరేకులు సీరియల్ లో ఆమె ప్రేక్షకుల్ని బాగా మెప్పించారు.ఆ తర్వాత ఆమె జయప్రకాశ్ అనే వరంగల్ కి చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు. ఆమెకు ఇప్పుడు ఒక బిడ్డ కూడా పుట్టింది. ఇక సినిమాల్లో కూడా నటించి, ఆతర్వాత ఎన్నో సీరియళ్లలో లీడ్ రోల్స్ లో మెప్పించిన మలయాళ అశ్విని అంతరంగాలు సీరియల్ లో పద్మిని పాత్రలో బుల్లితెర ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్రవేసుకున్నారు. కళంకిత సీరియల్ లో కూడా నటించి మెప్పించిన ఈమె ప్రస్తుతం నటనకు ఇక్కడ దూరమై, సింగపూర్ లో ఉంటున్నా రట. ఎప్పటికప్పుడు ఫేసుబుక్ ద్వారా ఫాన్స్ తో షేర్ చేసుకుంటున్న వివరాలు చూస్తుంటే, ఆమె అక్కడి సీరియళ్ళలో నటన కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.