అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు సీరియల్ నటి ధరణి లైఫ్…నమ్మటం కష్టం
Attarintlo akka chellellu serial dharani : టివి సీరియల్స్ కి ఆడియన్స్ నుంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో జి తెలుగులో అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు సీరియల్ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఇందులోని నటీనటులు తమ నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఇందులో నటిస్తున్న ధరణి తెలుగు ఆడియన్స్ కి బాగా పరిచయం ఉన్నదే. మొదట కన్నడ సీరియల్స్ లో నటించింది. ఓం అనే కన్నడ మూవీలో కూడా నటించింది.
ఆతర్వాత తెలుగులో నిన్నే పెళ్ళాడతా సీరియల్ తో ఎంట్రీ ఇచ్చి, మృదులపాత్రలో తన అందంతో, నటనతో ఆడియన్స్ ని అలరించి, అందరి మనస్సులో ముద్ర వేసుకున్న ధరణి అసలు పేరు భూమి శెట్టి. ఈమె 1998ఫిబ్రవరి 19న కర్ణాటకలోని ఉడిపి జిల్లా కొండాపురా లో జన్మించింది. ఈమెకు ఓ బ్రదర్, ఓ సిస్టర్ ఉన్నారు. ఏ ఎం సి ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసింది.
చిన్నప్పటి నుంచి యాక్టింగ్, డాన్స్ అంటే ఎంతో మక్కువ. స్కూల్స్ డేస్ లో కల్చరల్ ఈవెంట్స్ లో చురుగ్గా పాల్గొనేది. బిటెక్ అయ్యాక మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన భూమి శెట్టి మోడల్ రంగంలో రాణించింది. హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ వుమెన్ టైటిల్ ని గెలుచుకుంది. కన్నడ బిగ్ బాస్ రియాల్టీ షో 7వ సీజన్ లో పాల్గొంది. మజా భారత షో లో కూడా పాల్గొంది. అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు సీరియల్ లో నటిస్తూ, ఆడియన్స్ ని మెప్పిస్తోంది.