తెలుగులో ఒక్క ముక్క తెలుగు రాని హీరోలు ఎంతమంది ఉన్నారో…?
Tollywood Heroes :అప్పటి రోజుల్లో ANR, NTR, శోభన్ బాబు, కృష్ణ లాంటి హీరోలతో పాటు సావిత్రి, జామున, భానుమతి లాంటి హీరోయిన్స్ తెలుగుదనానికి ప్రతీకగా ఉండేవారు. బానుమతి అయితే కవయత్రి కావటంతో అచ్చమైన తెలుగులో మాట్లాడేది. బానుమతి గారు అయితే తన పాటలను తానే రాసుకొని పాడేవారు. ఆమెలో అంతలా టాలెంట్ ఉండేది.
ఎన్‌టిఆర్ తెలుగు గురించి ప్రత్యెకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇక నాగేశ్వర రావు,కృష్ణ కూడా తెలుగు బాగా మాట్లాడేవారు. ప్రస్తుతం నటిస్తున్న చాలా మంది నటులకు తెలుగు రాదు. వేరే ప్రాంతానికి చెందిన నటులకు తెలుగు రాదంటే పర్వాలేదు. కానీ మన ప్రాంతానికి చెందిన వారికే తెలుగు రాదంటే మాత్రం కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. వారి ఎవరో ఒకసారి చూద్దాం.
సూపర్ స్టార్ కృష్ణ కొడుకు మహేశ్ బాబుకి తెలుగు రాదట. డైలాగ్స్ అన్నీ ఇంగ్లీష్ లో రాసుకుని తెలుగులో చెప్తారట. సహజనటిగా పేరు తెచ్చుకున్న జయసుధకు కూడా తెలుగు రాదు.సినిమాల్లో నటించే అప్పుడు ఈవిడకి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండడం వలన ఒకసారి చెప్పిన డైలాగు ఠక్కున మళ్ళీ చెప్పేది.
జయసుధకి వయస్సు పెరగటంతో జ్ణాపకశక్తి తగ్గి ప్రోమ్ప్టింగ్ అడుగుతుందట.డైలాగ్ కింగ్ మోహన్ బాబు పిల్లలకు కూడా తెలుగు రాదు. అలాగే రామ్ చరణ్ కి తెలుగు రాదు. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాడు. అక్కినేని వారసుడు అఖిల్ పరిస్తితి కూడా అంతే.