MoviesTollywood news in telugu

ఈ విలన్ భార్య టాప్ హీరోయిన్…ఎవరో తెలుసా?

Tollywood villan Tarun Arora :ఏదైనా సినిమా హిట్ అయితే హీరోతో పాటు సమాన రేంజ్ లో నటించిన విలన్ కి కూడా క్రెడిట్ సగం దక్కుతుంది. అలాగే హీరోయిన్, మిగిలిన నటుల నటన , మ్యూజిక్ , డైరెక్షన్ ఇలా అన్నీ కల్సి వస్తేనే సినిమా హిట్ అవుతుంది. అయితే హీరోని పొగిడేసి, విలన్ ని తిట్టుకోవడం సహజంగా చూస్తుంటాం. అయితే విలన్ తరుణ్ రాజ్ మంచి నటనతో పేరు తెచ్చుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ తీసిన ఖైదీ నెంబర్ 150ద్వారా విలన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన తరుణ్ రాజ్ అరోరా స్టైలిష్ విలన్ గా అదరగొట్టాడు.

అర్జున్ సురవరం మూవీలో కూడా ప్రతినాయకుని పాత్రలో అరోరా నటించాడు. అది కూడా హిట్ కొట్టడంతో ఈ మధ్య జరిగిన ఓ ఇంటర్యూలో కొన్ని పర్సనల్ విషయాలు, ముఖ్యమైన విషయాలు మీడియాతో షేర్ చేసుకున్నారు. అస్సాంలో పుట్టి చదువుకోసం చెన్నై వచ్చారట. మోడలింగ్ ద్వారా దేశమంతా విస్తరించి హిందీ సినిమాల్లో చేసారు. అలా దక్షిణాదికి వచ్చారు. మోడలింగ్ రంగంతో ఆయన కెరీర్ స్టార్ట్ కావడంతో ప్రతి సినిమాలో స్టైలిష్ గా కనిపిస్తుంటాడు. ఇంతకీ ఈయన ఎవరంటే, ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంజలా జవేరీ భర్త.

నచ్చినట్టు చేయమని భార్య అంజలా జవేరి చెబుతుందని, ఎలాంటి సలహాలు ఇవ్వదని తరుణ్ రాజ్ అరోరా చెప్పుకొచ్చాడు. తన సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తుందని, తనను సౌత్ విలన్ అని ఫాన్స్ పిలవడం ఇంకా ఆనందంగా ఉందని చెప్పారు. సినిమాల్లో నచ్చక మళ్ళీ మోడలింగ్ లోకి వచ్చేసారా. ఇక అంజలాతో ముంబయిలోని ప్రేమలో పడ్డారట. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఆమె రాణిస్తుంటే ,ఈయన మోడలింగ్ లో ఉండేవారు. ఓ ఈవెంట్ లో ఇద్దరికీ ఏర్పడ్డ పరిచయం ప్రేమకు దారితీసి, పెళ్లిదాకా నడిపించింది. ప్రేమకు చిరునామాగా ఉన్నాం కనుక పిల్లలు వద్దు అనుకున్నారట. అయితే అంజలా మళ్ళీ సినిమాల్లో వేస్తానంటే ఒప్పుకుంటానని కూడా తరుణ్ రాజ్ అరోరా చెప్పారు.