వెంకటేష్ కూతుళ్ల గురించి ఎవరికి తెలియని ఆసక్తికరమైన విషయాలు
venkatesh daughters :తెలుగు సినిమా పరిశ్రమలో రెండవ తరం తీసుకుంటే, టాప్ హీరోలుగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. ఇందులో చిరంజీవి స్వయంకృషితో ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగాడు. మిగిలిన ముగ్గురూ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా, తమ టాలెంట్ తో నిలదొక్కుకున్నారు. అయితే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునల కుటుంబాలు ముఖ్యంగా వారి పిల్లల గురించి చాలామందికి తెలుసు. పైగా వారి వారసులు ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్నారు.
కానీ,విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ గురించి చాలామంది జనాలకే కాదు, ఫాన్స్ కి కూడా పెద్దగా తెలీదు. వెంకీ ఎంత పెద్ద స్టార్ అయినాగాని ఎప్పుడు కూడా తన భార్య, పిల్లల ను బయట ఫంక్షన్స్ కి, ప్రోగ్రామ్స్ కి తీసుకెళ్లిన దాఖలాలు లేవు. వెంకటేష్ కు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. వెంకీ కొడుకు అర్జున్ వస్తూ ఉంటాడు. మిగతా ముగ్గురు కూతుళ్ళ గురించి తెలీదు .
నిజానికి వెంకటేష్ 25 ఏళ్ల వయస్సులో చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన నీరజారెడ్డిని 1985 కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు సంతానం. అందులో ఆశ్రీత, హైవాహిని, భావన ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు. అయితే వెంకీ పెద్ద కూతురు ఆశ్రీత ఎవరినో ప్రేమించిందన్న వార్తలు దుమారం రేపడంతో ఇరు కుటుంబాలు ఈ వార్తలను ఖండించాయి. బిజినెస్ రంగం వైపు ఆసక్తి గల పెద్దమ్మాయి వ్యాపార రంగంలో ఎవరూ చేయని అద్భుతాలు చేయాలని ఉందంటూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. రెండో కూతురు హై వాహిని ఫ్యాషన్ డిజైనర్ కావడంతో ఆమె దుస్తులకు మంచి పాపులర్టీ వచ్చింది.
ఇక ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న వెంకీ ఆఖరి అమ్మాయి భావన సినిమా రంగంలోకి రావాలని దృష్టి సారిస్తోంది. వెంకీ కొడుకు అర్జున్ కూడా సినిమాల్లో నటించే ఛాన్స్ ఉందని సినీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ విషయంలో వెంకీ క్లారిటీ ఇస్తే, ఫాన్స్ ఖుషీ అవుతారు. ఇక ఉన్నట్టుండి మళ్ళీ కొన్ని రోజుల తరువాత పెద్ద కూతురు ఆశ్రీత ప్రేమలో ఉన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి.
అదికూడా హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ ఆర్.సుందర్ రెడ్డి మనవడితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ఆ వార్తల సారాంశం. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంకీ బ్రదర్, బడా ప్రొడ్యూసర్ అయిన సురేష్ బాబు ఫ్యామిలీ పెద్దగా రంగంలోకి దిగి, సుందర్ రెడ్డి ఫ్యామిలీతో స్వయంగా మాట్లాడారని కూడా టాక్. ఏది ఏమైనా ఆ ఫ్యామిలీ నుంచి వార్త బయటకు వస్తే, తప్ప ఇందులో నిజానిజాలేమిటో తేలదు.