అరవింద్ స్వామి కూతురు ఏమి చేస్తుందో తెలుసా?
Aravind swamy daughter : కెరీర్ ఆరంభంలో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా మారాడు అరవింద్ స్వామి. చెన్నైకు చెందిన అరవింద్ స్వామి అమెరికాలోని ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ లో మాస్టర్ డిగ్రీ చేశారు.బాల్యంలో డాక్టర్ కావాలనుకున్న అరవింద్ స్వామి పాకెట్ మనీ కోసం కొన్ని యాడ్స్ లో నటించారు.
ఆ ప్రకటనలు మణిరత్నం చూడటంతో అరవింద్ స్వామి హీరో అవ్వటానికి ఎక్కువ సమయం పట్టలేదు. అలా నటిస్తూ ధృవ సినిమాలో స్టైలిష్ విలన్ గా నటించి మెప్పించాడు. విలన్ గా అవకాశాలు ఎక్కువగా వస్తున్న అచి తూచి నిర్ణయం తీసుకుంటున్నాడు. ఒక వైపు వ్యాపారాలు చూసుకుంటూ మరో వైపు సినిమాలు చేస్తున్నాడు అరవింద్ స్వామి.
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే అరవింద్ స్వామి జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అరవింద్ స్వామి తన కూతురుతో సైకిల్ పై దిగిన ఫోటోను షేర్ చేశారు.ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది. నెటిజన్స్ అరవింద్ స్వామికి ఇంత పెద్ద కూతురు ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.