నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది?
Bad Breath Causes :కొంత మందితో మాట్లాడటానికి ఇష్టపడతాం, మరికొంతమందిని చూస్తేనే చిరాకు వస్తుంది. ఎందుకంటే కొంత మంది నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే నోటి దుర్వాసన అనేది సాధారణంగా అందరూ ఎదుర్కొనే సమస్యే. అసలు నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది? దీనిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. మన నోటి లోని అనేక బ్యాక్టీరియాలు విడుదల చేసే వాయువులు దంతాలు, చిగుళ్లూ, నాలుక పై ఒక పూతగా ఏర్పడి నోటి దుర్వాసనకు కారణం కావచ్చు.
2. సాధారణంగా పళ్ల సందుల్లో ఇరుక్కున్న ఆహార పదార్ధాలు వల్ల కూడా నోటి దుర్వాసన సమస్య వచ్చే అవకాశం ఉంది.అలాగే కట్టుడు పళ్లూ ఉంటే వాటిని సరైన రీతిలో శుభ్రం చేయకపోయినా ఈ దుర్వాసన సమస్య వస్తుంది.
3. ఇక పొగ తాగే వారిలో నోటి దుర్వాసన సమస్య అధికంగా ఉంటుంది.
4. తరచూ నోటితో గాలి పీల్చే వారిలో నోటి దుర్వాసన సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాగే వెల్లుల్లి, ఉల్లి వంటి ఘాటైన పదార్ధాలు, కాఫీ త్రాగటం వలన కూడా నోటినుంచి చెడు వాసనను వస్తుంది.
5. ఏదైనా చిగుళ్ల వ్యాధి లేదా దంత సమస్య వస్తొందన్న సూచనగా నోటినుంచి చెడు వాసన వచ్చే ప్రమాదం కూడా ఉంది.
6. సైనసైటిస్, బ్రాంకైటిస్, డయాబెటిస్, కాలేయ, మూత్రపిండ వ్యాధులు లేదా ముక్కు, గొంతు, ఊపిరితిత్తులలో ఇన్‌ఫెక్షన్స్ వంటి ఆరోగ్య సమస్యలు కుడా నోటి నుంచి చెడు వాసనన వచ్చేలా చేస్తాయి.
నోటి దుర్వాసనకు దూరంగా ఉండాలంటే ఏం చెయ్యాలి?
దంతాల మధ్యలో అంటే పళ్ల సందుల్లోకి వెళ్లే బ్రష్‌లను వాడడం లేదా డెంటల్ ఫ్లాస్ వాడడం వలన పళ్ల సందుల్లో ఇరుక్కున్న ఆహారపదార్ధాలను శుభ్రం చేసుకోవడానికి వీలవుతుంది.
అలాగే నాలుక బద్దని వాడడం మరవద్దు. ఒకవేళ నోరు బాగా పొడిబారుతోంది అనిపిస్తే షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ ను నములుతూ పొడి బారడాన్ని తగ్గిచుకునే ప్రయత్నం చేయాలి.
ఇలాంటి సాధారణ జాగ్రత్తలు తీసుకున్నాకా కూడా నొటి దుర్వాసన సమస్య వేధిస్తుంటే దంత వైద్యులని సంప్రదించి వారి సూచనలు సలహాలు పాటించండి.