బిగ్ బాస్ కంటెస్టెంట్లు లక్షలు ఎలా సంపాదిస్తున్నారో చూడండి
Bigg Boss Contestants :హిందీ నుంచి వరుసగా ఒక్కో భాషలో ఎంట్రీ ఇస్తూ తెలుగులో కూడా అప్పుడే నాలుగు సీజన్లు పూర్తిచేసుకుంది బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో గురించి విమర్శలు ఎంతగా వెల్లువెత్తుతున్నాయో ఆదరణ కూడా అదేస్థాయిలో ఉంది. అందుకే సక్సెస్ ఫుల్ గా నాలుగు సీజన్లు పూర్తిచేసుకుంది. ఇక సీజన్ 4 లో 19 మంది కంటెస్టెంట్లు పాల్గొంటే, . అభిజిత్ విన్నర్ గా నిలవగా అఖిల్ రన్నర్ గా సోహెల్ టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచారు. అయితే ఈ షో లో పాల్గొన్న తర్వాత కంటెస్టెంట్స్ కి పెద్దగా ఛాన్స్ లు రావడం లేదన్న టాక్ కూడా నడుస్తోంది.
పైగా బిగ్ బాస్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3లలో పాల్గొన్న కంటెస్టెంట్లలో ఐదారుగురికి మినహా ఎవరికీ పెద్దగా ఛాన్స్ లు రాకపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. బిగ్ బాస్ షో చాలామందికి ప్లస్ అవుతున్నా, కొందరు కంటెస్టెంట్లు మాత్రం బిగ్ బాస్ షోలో ప్రవర్తన వల్ల ఛాన్స్ లు కోల్పోతున్నారు. బిగ్ బాస్ షోలోకి వెళ్లకముందు వరుస అవకాశాలతో బిజీగా ఉన్నవారు హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత తగినన్నిఛాన్స్ లు రావడంలేదని, ఫలితంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారని అంటున్నారు.
మరోవైపు బిగ్ బాస్ షో ద్వారా కంటెస్టెంట్లకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంటోంది. దాంతో యూట్యూబ్ ఛానల్స్ ఉన్న కంటెస్టెంట్స్ కి , వారి అనుచరులకు సబ్ స్క్రైబర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొన్ని కంపెనీలు బిగ్ బాస్ కంటెస్టెంట్ల ద్వారా తమ బ్రాండ్ లను ప్రమోట్ చేస్తున్నారట. దాంతో పాపులారిటీ కావాలని కోరుకునే వాళ్లకు బిగ్ బాస్ షో సరైన వేదిక అవుతోందని వాదన ఉంది. ముఖ్యంగా బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక కొందరు కంటెస్టెంట్లు యూట్యూబ్ ఛానెళ్లను స్టార్ట్ చేసే లక్షల రూపాయల ఆదాయం సొంతం చేసుకుంటున్నారని టాక్. అందుకే బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ కావడానికి సమయం ఉన్నప్పటికీ, సరైన గుర్తింపు లేని సినీ , సీరియల్ నటులు, యూట్యూబ్ స్టార్లు, యాంకర్లు ఈ షో కోసం ఇప్పటి నుంచే కాచుకుని కూర్చున్నారని వినిపిస్తోంది.