మహేష్ NO చెప్పితే పవన్ కల్యాణ్ చేస్తున్నాడా…?
Pawan kalyan and Mahesh Babu : పవన్ కల్యాణ్ రాజకీయాలకు వెళ్ళాక సినిమాలు చేయలేదు. ఇప్పుడే వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. వకీల్ సాబ్ సినిమా దాదాపుగా పూర్తి అయ్యింది. సినిమాలను చాలా స్పీడ్ గా చేస్తున్నాడు పవన్ కల్యాణ్. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలు కూడా చూసుకుంటూ చాలా బిజీగా ఉన్నాడు.
మహేష్ చేయాల్సిన ఒక సినిమా పవన్ చేతికి రావటంతో వెంటనే ఒకే చెప్పేసినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రానున్న ‘జనగణమన’ అనే పవర్ఫుల్ సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమా కోసం పూరీ ముందుగా మహేష్ ని అనుకోని మహేష్ దగ్గరకు వెళ్ళి కథ చెప్పితే పెద్దగా ఆసక్తి చూపలేదట. దాంతో ఆ సినిమాను పూరీ పవన్ కల్యాణ్ తో తీస్తున్నారు.