ఈ విలన్ కి ఇతని భార్యకి ఎన్ని సంవత్సరాలు తేడా ఉందో తెలుసా?
Rahul Dev And Mugdha Godse :ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని అంటారు. ప్రేమ గుడ్డిది అని అందుకే కొందరు అంటుంటారు కూడా. ఇందుకు తార్కాణం ఇటీవల మరాఠీ నటి తనకంటే 8ఏళ్ళు చిన్నవ్యక్తిని పెళ్లాడింది. ఇక తనకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తితో ఓ నటి సహ జీవనం సాగిస్తోంది. ఆ నటుడు ఎవరంటే టాలీవుడ్ విలన్ రాహుల్ దేవ్. ఎందరో అగ్ర హీరోల సినిమాల్లో నెగెటివ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
గతంలో రీనాతో పెళ్లి జరగడం, సిద్ధార్ధ్ అనే కుమారుడు కూడా ఉండగా, రీనా 2009లో కేన్సర్ తో బాధపడుతూ మరణించింది. ఒంటరిగా ఉంటున్న రాహుల్ దేవ్ కి ఓ ఫంక్షన్ లో నటి ముగ్ద గోడ్సే తో పరిచయం ఏర్పడింది. మోడల్ గా జీవితం ప్రారంభించిన ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. గత ఎనిమిదేళ్లుగా రాహుల్ తో సహజీవనం చేస్తోంది.
ముగ్ద ఓ టివి కార్యక్రమంలో తమ సహజీవనం గురించి వెల్లడిస్తూ, ఎవరైనా, ఎప్పుడైనా ఎవరితోనైనా ప్రేమలో పడొచ్చని, ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని చెప్పింది. దేవ్ తో సంతోషంగానే ఉన్నానని వెల్లడించింది. ఇద్దరి మధ్యా 18ఏళ్ళ వయస్సు తేడా ఉంది. రాహుల్ కన్నా 18ఏళ్ళు చిన్నదే. అయితే ప్రేమ ఎప్పుడు పుడుతుందో అనుభవం పూర్వకంగానే తెలుస్తుందని చెప్పింది. ఇక ఇరు ఫ్యామిలీస్ మధ్య బేధాలు లేవని, వయస్సు అనేది సమస్య కాదని రాహుల్ చెప్పాడు.