MoviesTollywood news in telugu

హీరో రవితేజ అసలు పేరు ఏమిటో తెలుసా?

Ravi Teja Khiladi teaser :మాస్ మహారాజ్ రవితేజ ఈ సంవత్సరం క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. నిన్న రవితేజ పుట్టిన రోజు. సినిమా హిట్ కావడంతో చాలా ఆనందంగా పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. సినీపరిశ్రమలోకి వచ్చిన కొత్తలో కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.

చిన్నతనం నుండే రవితేజకు సినిమాలంటే చాలా ఆసక్తి. తండ్రి ఇచ్చే పాకెట్ మనీతో సినిమాలు చూసేవాడు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ చివరికి స్టార్ హీరో అయ్యాడు. రవితేజ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల ద్వారా హీరోగా నిలదొక్కుకున్నాడు.

రవితేజ ప్రస్తుతం ఖిలాడి సినిమాలో నటిస్తుండగా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.రవితేజ బలుపు, పవర్, రాజా ది గ్రేట్ సినిమాల్లో పాటలు పాడి సింగర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. నిన్న రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఖిలాడి టిజర్ రిలీజ్ అయ్యింది.