MoviesTollywood news in telugu

లైగర్ బడ్జెట్ అంచనాలు దాటేసిందా …ఎన్ని కొట్లో తెలిస్తే షాక్ అవ్వాలసిందే

vijaya devarakonda liger :రామ్ తో ఇస్మార్ట్ శంకర్ తర్వాత డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న మూవీ లైగర్. ఇందులో రౌడీ స్టార్   విజయ్ దేవరకొండ హీరో. వేగంగా సినిమాలు పూర్తిచేయడంలో పూరీ దిట్ట. అందుకే  అన్నీ  సిద్ధం చేసుకున్న పూరీ.. ఇక లైగర్ ను జెట్ స్పీడ్ లో పూర్తిచేయాలని నిర్ణయించుకున్నాడట. ఈ క్రమంలోనే రిలీజ్ డేట్ పై కూడా ఒక క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. కరోనా ఎఫెక్ట్ లేకుంటే  ఈపాటికే లైగర్ సినిమా పూర్తయిపోయి  థియేటర్స్ లో పడేది. ఇక   ఈ సినిమా  షూటింగ్ పనులు ఇప్పుడు మొదలయ్యాయి.
మరోవైపు ఈ  సినిమా బడ్జెట్ విషయంలో పలు రూమర్స్ షికారు చేస్తున్నాయి.  నిజానికి పక్కా ప్లాన్ తో ఉండే, పూరీ సినిమా అంటే బడ్జెట్ ఎప్పుడూ లిమిట్స్ దాటదు. కాకపొతే తొలిసారి   పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్న నేపథ్యంలో   అంచనాలను రీచ్ అవ్వాలనే లక్ష్యంతో  యూనిట్ పనిచేస్తోంది.  అందుకే  లైగర్ బడ్జెట్ అనుకున్నదానికంటే కాస్త ఎక్కువవుతోందట.  తాజా లెక్కల ప్రకారం ఈ సినిమా కోసం దాదాపు రూ.110కోట్ల వరకు ఖర్చు చేస్తారని  టాక్.
ఒకవేళ   అంచనా దాటితే మరింత పెరిగే ఛాన్స్ కూడా ఉందని కూడా ముందే ఊహిస్తున్నారట.    ఈ మూవీని  వేసవి  లోగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట.  దాన్ని బట్టి జులైలో థియేటర్లలో పడుతుందని , అప్పటికి పెద్ద సినిమాల పోటీ కూడా ఉండదని అంచనా వేస్తున్నారట  లైగర్ సినిమాని హిందీలో కరణ్ జోహార్ విడుదల చేయడానికి నిర్ణయించగా, ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.  మొత్తానికి  పూరీ ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తీస్తున్నాడు.