ఈ హీరోయిన్ గురించి మీకు తెలియని అసలు నిజాలు ఇవే…!?
Mail movie heroine gowri priya reddy :చిత్రం మూవీతో డైరెక్టర్ గా ఎంటరై తన సత్తా చాటిన తేజ దర్శకత్వంలో వచ్చిన హోరాహోరీ మూవీలో ఒక పాట పాడిన గౌరి ప్రియా రెడ్డి ఆతర్వాత నిర్మలా కాన్వెంట్, మనలో ఒకడు, ఫిదా సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఏకంగా ‘మెయిల్’ తో హీరోయిన్ అయింది. కరోనా లాక్ డౌన్ తో ఓటిటి ఫ్లాట్ ఫార్మ్ మీద సినిమాలు, రకరకాల షోస్, సిరీస్ వస్తున్నాయి. అందులో భాగంగా ఆహాలో ‘మెయిల్’ సిరీస్ విడుదలై సూపర్ హిట్ కొట్టింది.
ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో ప్రజలు దాని వాడకం తెలిసీ తెలియక ఎలా ప్రవర్తించారనే కథాంశంతో దర్శకుడు ఉదయ్ గుర్రాల హాస్య భరితంగా, మనసుకు హత్తుకునేలా తీసిన ‘మెయిల్’ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించ గా, మంచి టాక్ తెచ్చుకుంది. ఇక సింగర్‌గా శభాష్ అనిపించుకొని, బ్యూటీ పోటీలలో సత్తా చాటిన గౌరి ప్రియా రెడ్డి “మెయిల్” తో హీరోయిన్ గా మారింది. మెయిల్ మూవీ విజయంతో గౌరి ప్రియా రెడ్డికి మంచిది గుర్తింపు వచ్చింది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను ఇప్పుడు సంతోషంగా ఉన్నట్లు చెబుతూ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.
శ్రీనివాస్ రెడ్డి , వసుంధర దంపతులకు జన్మించిన గౌరి ప్రియ బేగంపేటలోని సెంట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజ్ లో బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ చేసింది. మిస్ హైదరాబాద్ టైటిల్ గెలుచుకుంది. లలిత సంగీతంలో కూడా శిక్షణ తీసుకున్న ఈమె మంచి సింగర్. సాక్షి ఎరీనా యూత్ సింగింగ్ కాంపిటీషన్ లో విజేతగా నిలిచింది.
జెమినీ టీవీలో కొంతకాలం యాంకర్ గా పని చేసి, బోల్ బేబీ బోల్ ప్రోగ్రాంలో రెండవ సీజన్ లో రెండవ స్థానంలో, మూడవ సీజన్ లో మొదటి స్థానంలో నిలిచింది.ఎంతో మంది ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి స్టేజ్ షోస్ కూడా ఇవ్వడమే కాదు, చాయ్ బిస్కెట్ వాళ్ల గర్ల్ ఫార్ములా వీడియోస్ లో నటించింది.