F3 బడ్జెట్ ఎంత… బిజినెస్ ఎంత చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
f3 movie budget :వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా మెహరీన్ హీరోయిన్స్ గా అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఎఫ్ 2 సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ఎఫ్ త్రీ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి ప్లాన్ చేస్తున్నారు. దాంతో బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ వారు 5 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి సాటిలైట్ రైట్స్ 12 కోట్లకు జీ తెలుగు వారు కొనుగోలు చేశారట.ఇక థియేట్రికల్ రైట్స్ ద్వారా మరో 50 కోట్లకు మించి వస్తాయని అంచనా వేస్తున్నారు.
40 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమా 80 కోట్లకు పైగా బిజినెస్ చేసి అందరినీ ఆశ్చర్యంనకు గురి చేసింది. ఎంతైనా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ దిల్ రాజు కదా.