కార్తీక దీపం సీరియల్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన హిమ
karthika deepam child artist hima :తెలుగు బుల్లితెరపై సీరియల్స్ కి మంచి ఆదరణ ఉంది. అయితే స్టార్ మా లో మొదటి నుంచి ఉత్కంఠతో దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ ఏ రేంజ్ కి వెళ్లిందంటే, టాప్ టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకోవడమే కాదు, సినిమా కు ఉండే ఆదరణ ను సైతం మించిపోయింది. ముఖ్యంగా వంటలక్క, డాక్టర్ బాబు ల పాత్ర, వారి మధ్య జరిగే మాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ఆ సీరియల్లో డాక్టర్ బాబు కూతురుగా హిమ(సహృద) నటిస్తుండగా, అందులో తనను అందంగా చూపించరని తెలిసాక చాలా బాధ పడిపోయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హిమ పాల్గొంటూ, కార్తీకదీపం సీరియల్ గురించి కొన్ని విషయాలు వెల్లడించింది. హిమకు తన ఫస్ట్ లుక్ లో ప్రాబ్లమ్ తన శరీర రంగు పైనే వచ్చింది. తనకు తన అమ్మ దీప వలే డీ గ్లామర్ గా చూపించడానికి బ్లాక్ మేకప్ వేయడంతో చాలా బాధ పడ్డానని చెప్పుకొచ్చింది.
అయితే రాను రాను తనకు ఆ పాత్ర బాగా నచ్చిందని, సీరియల్ కథ కూడా ఎంతో బాగుందని చెప్పుకొచ్చింది. నిజానికి తను మొదట్లో చాలా భయపడ్డానని, మేకప్ అంటే ఇష్టమే అయినప్పటికీ మొదట తనకు నచ్చలేదని చెప్పింది. నిజానికి తాను కార్తీకదీపం సీరియల్ కు మాట ఇవ్వడంతో మేకప్ గురించి వెనుకంజ వేయలేకపోయానని చెప్పింది.