రొమాన్స్ పండించిన విలన్ జంటలు…ఎవరో చూడండి
Tollywood villains :సినిమా ఇండస్ట్రీలో మొదట్లో చిత్తూరు వి నాగయ్య, కన్నాంబ తరం నుంచి ఇప్పటి యంగ్ హీరోల తరం వరకూ హీరో, హీరోయిన్స్ తో పాటు, కమెడియన్స్ జంటలు కూడా సాంగ్స్ తో ఆడిపాడారు. ఇక విలన్లు కూడా తమ సాంగ్స్ తో అలరించారు. విలన్ జంటలు లెక్కతీసుకుంటే ఎన్టీఆర్ నటించిన దాన వీర సూర కర్ణ సినిమాలో దుర్యోధనుడికి సాంగ్ పెట్టడం అప్పట్లో సంచలనం. పౌరాణికం పైగా, విలన్ కి పాట ఏమిటి అని బిత్తరబోయినా డాక్టర్ సినారె, ‘చిత్రం భళారే విచిత్రం’ డ్యూటీ రాయడం, ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించడం, ఇక సినిమాలో ఆ సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావడంతో కొత్త ట్రెండ్ మొదలైంది. అలాగే విలన్లు కూడా భార్యా భర్తలుగా నటించడం, రొమాన్స్ పండించడం వంటివి చేసారు. వాటిని పరిశీలిస్తే,
బిగ్ బాస్ మూవీ లో కోట శ్రీనివాస్ రావు, జయమాలిని భార్య భర్తలుగా నటించ డంతో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ బాగా మెప్పించారు. అమ్మోరు మూవీలో కమెడియన్ బాబు మోహన్ విలన్ పాత్రలో మెప్పించగా, అతడికి భార్యగా నటించిన వడివుక్కరసి తన పాత్రలో అదరగొట్టింది. అలాగే బాబు మోహన్.జయలలిత, అనుజ వంటి కమెడియన్లతో విపరీతంగా రొమాన్స్ చేసిన మూవీస్ ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అర్జున్ మూవీలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటించగా, ఆయన భార్యగా నటించిన ఒకప్పటి హీరోయిన్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సరిత విలనిజం పండించింది. కార్తికేయన్ హీరోగా నటించిన సీమ రాజు సినిమాలో నటుడు లాల్ విలన్ గా నటిస్తే, అతడి భార్యగా సిమ్రాన్ నటించి ఆశ్చర్యపోయేలా చేసింది.
ఇక ఒకప్పటి స్టార్ డైరెక్టర్ టి కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ కెరీర్ తొలినాళ్లలో హీరోగా చేసినప్పటికీ, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమాతో విలన్ అవతారం ఎత్తాడు. హీరోయిన రాశి కూడా నిజం సినిమాతో తనలోని నెగటివ్ కోణాన్ని చూపించి, వావ్ అనిపించింది. అలాగే జయం సినిమాలో కూడా ఓ లేడీ ఆర్టిస్ట్ తో గోపీచంద్ రొమాన్స్ చేసి అదరగొట్టాడు. అలాగే ప్రముఖ విలన్ ప్రదీప్ రావత్ బిందు చంద్రమౌళి తో కలిసి “నేనే రాజు నేనే మంత్రి” సినిమాలో కెమిస్ట్రీ పండించారు.ఈ సినిమాలో వీళ్లిద్దరు చూడ్డానికి నిజంగా భార్య భర్త లాగానే కనిపించారంటే అతిశయోక్తి కాదు.నేను శైలజ, సై వంటి చిత్రాల్లో కూడా ప్రదీప్ రావత్ హీరో లెవల్లో రొమాన్స్ చేసాడు. ఇక పంచాక్షరి మూవీలో కూడా విలన్ పాత్రల్లో నటించిన ప్రదీప్ రావత్, విజయవాణి భార్యభర్తలుగా మెప్పించారు. విలన్ శియాజీ షిండే కి జోడీగా టాలీవుడ్ నటులు ఎందరో జోడి కట్టి మెప్పించారు. సంక్రాంతికి రిలీజైన సూపర్ హిట్ మూవీ ‘క్రాక్’ లో జయమ్మ గా వరలక్ష్మి శరత్ కుమార్, కటారి కృష్ణ గా సముద్రఖని తమ పాత్రల్లో జీవించారు.