MoviesTollywood news in telugu

యాంకర్ అనసూయ వయస్సు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాలసిందే

Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ అంటే తెలియని బుల్లితెర అభిమానులు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. అనసూయ బుల్లి తెర మీదే కాకుండా వెండితెర మీద కూడా తనేమిటో నిరూపించుకుని ముందడుగు వేస్తూ ముందుకు వెళుతోంది. అనసూయ 17 సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ నాగ సినిమా లో కనిపించింది ఆ తర్వాత యాంకర్ గా మారి జబర్దస్త్ తో టాప్ యాంకర్ గా మారింది.

అనసూయ పెళ్లి అయ్యి దాదాపు గా పది సంవత్సరాలయింది. దాంతో అనసూయ వయసు ఎంత అంటే సోషల్ మీడియాలో రకరకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన అనసూయ గ్లామర్ పరంగా చూసుకుంటే అసలు ఎక్కడ తగ్గదు. తన వయస్సు గురించి మాట్లాడుతూ అనసూయ ఒక్కొక్కరు ఒక్కో రకంగా తన వయసు గురించి రాస్తున్నారని… తన అసలు వయసు ఎంతో ఓపెన్ గా చెప్పింది

తనకు పాతికేళ్ల కంటే లోపే పెళ్లైపోయిందని.. ఇప్పుడు తన వయసు 34 అని ఓపెన్ అయిపోయింది. అంటే కేవలం 17 ఏళ్ల వయసులో నాగ సినిమాలో మెరిసింది. ఆ తర్వాత 24 ఏళ్లకు యాంకర్ అయినట్లు చెప్పింది. ప్రస్తుతం షోలతో పాటు సినిమాలు కూడా చేస్తూ బిజీ అయిపోయింది