అనసూయ స్పెషల్ సాంగ్ కి నిమిషానికి ఎన్ని లక్షలు తీసుకుంటుందో తెలుసా?
Telugu Anchor Anasuya :క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్, సమంత కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలంలో రంగమ్మత్త వంటి కీలకపాత్రను పోషించి నటిగా మంచిపేరు తెచ్చుకున్న అనసూయ సినిమాల్లో నటిగా రాణిస్తూనే, వీలు కుదిరితే ఐటమ్ సాంగ్స్ కి ఒకే చెప్పేస్తూ, టాప్ హీరోయిన్లను తలదాన్నేలా కెరీర్ మలచుకుంది. అసలు ఈటీవీలో వస్తున్న జబర్దస్త్ కామెడీ షోలో తన అందంతో అలరించిన అనసూయ యాంకరింగ్ లో కూడా పలు షోస్ లో దూసుకెళ్తూ తనదైన మార్క్ క్రియేట్ చేసుకుంది.
అదే సమయంలో సినిమాల్లో ఛాన్స్ ఆమెను మరోవైపు మళ్లించాయి. ముఖ్యంగా సినిమాల్లో అనసూయ ఐటమ్స్ సాంగ్స్ కు హిట్ టాక్ రావడంతో అనసూయకు ఐటమ్ సాంగ్స్ ఆఫర్స్ ఇస్తూ నిర్మాతలు క్యూ కడుతున్నారు. కార్తికేయ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న ” చావుకబురు చల్లగా” సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్న అనసూయ గురించి ప్రస్తుతం ఓ వార్త వైరాలవుతోంది.
ప్రతి టాప్ హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ తో అలరిస్తున్న అనసూయ మూడు నిమిషాల పాటకు 20 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తోందట. అందులో భాగంగానే తాజా సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ కోసం అనసూయ 20 లక్షలు రెమ్యునరేషన్ అడగగా చిత్ర యూనిట్ వెనకా ముందూ చూడకుండా ఒకే చెప్పిందట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్న చందంగా ఈ అమ్మడు క్యాష్ చేసుకుంటోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.