పుష్ప ఐటెం సాంగ్ కోసం పక్కా ప్లాన్ – చేసేదెవరో తెలుసా?
Allu Arjun Pushpa Movie :రామ్ చరణ్ తో రంగస్థలం బ్లాక్ బస్టర్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తీస్తున్న సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో సాగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.
అల్లు అర్జున్ సరసన రష్మిక మందాన హీరోయిన్‌గా నటిస్తోంది. లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటిస్తున్నారు. ఇక సుకుమార్ మూవీలో ఐటెం సాంగ్ అంటే అది ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పక్కర్లేదు. అయితే ఈ ఐటెం సాంగ్‌లో అల్లు అర్జున్‌తో స్టెప్పేసేందుకు ఓ స్పెషల్ లేడీని రంగంలోకి దించాలని సుకుమార్ పక్కా ప్లాన్ చేసాడు. ఇందుకోసం బాలీవుడ్ బ్యూటీలు దిశా పటానీ, శ్రద్దా కపూర్, కత్రినా కైఫ్ లాంటి వారిని సంప్రదించారట.
అయితే వాళ్ళతో డేట్స్ ఖాళీగా లేకపోవడం, ఒక్క సాంగ్ కోసమే రెమ్మ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలాను ఫైనల్ చేసి, ఈ సాంగ్ కోసం ఉర్వశికి 80 లక్షల రూపాయలను ముట్ట జెబుతున్నారని టాక్. ఇక దేవీ శ్రీ ప్రసాద్ ఈ ఐటెం సాంగ్‌కి అద్భుత బాణీలు కట్టారని, టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేయనున్నా డని తెలుస్తోంది. త్వరలోనే ఊర్వశి – అల్లు అర్జున్‌లపై ఈ మాస్ బీట్ సాంగ్ షూట్ చేస్తారట. గతంలో ఏ సినిమాలోనూ చుడని విధంగా’పుష్ప’ ఐటెం సాంగ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారట.