జబర్దస్త్ పారితోషికం గురించి షాకింగ్ కామెంట్ చేసిన శాంతి స్వరూప్
jabardasth shanthi swaroop :ఎవెరెన్ని చెప్పిన తెలుగు నాట కామెడీ షో అనగానే అందరి మదిలో మెదిలేది జబర్దస్త్ షో. ఈ షో ద్వారా ఎందరో కమెడియన్స్ ఎంట్రీ ఇచ్చి పేరుపెరుకి పేరుతొ పాటు రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది సినిమా ఇండస్ట్రీకి కూడా వెళ్లిన విషయం తెల్సిందే. అయితే అతి కొద్ది మంది మాత్రమే జబర్దస్త్ ద్వారా మంచి ఆదాయం దక్కించుకుంటున్నారని ఎక్కువ మంది కమెడియన్స్ కు చాలా తక్కువ పారితోషికం అందుతోందని కూడా వినిపిస్తోంది.
ఓపక్క తినడానికి లేని వారు ఈ షో ద్వారా కార్లలో తిరుగుతున్నారు. సొంత ఇళ్లు కూడా కట్టుకున్నారు. కొందరు కమెడియన్స్ మాత్రం ఇంకా అదే తక్కువ పారితోషికంతో జీవనంను సాగిస్తున్నారు. లేడీ గెటప్ లు ఎక్కువగా వేసే కమెడియన్ శాంతి స్వరూప్ మాటల్లో అయితే బయట జరుగు తున్న పబ్లిసిటీకి రియాల్టీగా ఇచ్చే రెమ్యునరేషన్ కి చాలా తేడా ఉంటుందట.
ఇప్పటికి కూడా కొందరు కమెడియన్స్ మూడు వేలు అయిదు వేలు తీసుకుంటున్నారన్నాడు. కొందరు కమెడియన్స్ మాత్రం జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ తో బయట స్టేజ్ షోలు చేసుకుంటూ అంతో ఇంతో సంపాదిస్తున్నారు. జబర్దస్త్ అనేది గుర్తింపు తెచ్చుకోవ డానికి మాత్రమేనని సంపాదన విషయంలో జబర్దస్త్ నుండి కమెడియన్స్ ఎక్కువ ఆశించరని కూడా శాంతి స్వరూప్ అన్నాడు. మల్లెమాల వారు ఇచ్చేదాని కంటే బయటకు ఎక్కువ చెప్పుకుంటున్నారని అంటున్నాడు.