MoviesTollywood news in telugu

ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా..?

Telugu Actress Namrata shirodkar :సోషల్ మీడియా విస్తృతి పెరగడంతో మామూలు జనం కన్నా సెలబ్రిటీలు ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్నారు. లాక్ డౌన్ సమయంలో సెలబ్రిటీలు ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి లేట్ గా చేరినా లేటెస్ట్ అన్నట్లుగా సరికొత్త విషయాలను షేర్ చేసుకుంటున్నారు. సెలెబ్రిటీలు పెట్టె ఫోటోలు ఒక్కోసారి గుర్తుపట్టడానికి వీలు లేనంతగా కూడా గమ్మత్తుగా ఉంటున్నాయి.

సూపర్ మహేష్ బాబు సరసన వంశీ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి, తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నమ్రత తర్వాత పలు సినిమాల్లో నటించి అందరిని మెప్పించారు. అనంతరం మహేష్ బాబుని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే భర్తకు అన్ని విషయాల్లో చేదోడువాదోడుగా ఉంటూ ముందుకి నడిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నమ్రత వారి కుటుంబానికి సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.

ఈ సందర్భంగా తాజాగా తనకు సంబంధించిన ఒక ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ ఫోటోలో నమ్రతతో పాటు తన చెల్లెలు శిరోద్కర్ కలసి తన తండ్రితో దిగిన ఫోటోని షేర్ చేయడంతో విపరీతంగా వైరలవుతోంది. నమ్రత చెల్లెలు శిల్పా శిరోద్కర్ పలు బాలీవుడ్ సినిమాలతో పాటు మోహన్ బాబు హీరోగా చేసిన ” బ్రహ్మ” తెలుగు మూవీలో నటించింది. ఈ సిస్టర్స్ ఇద్దరూ ప్రముఖ దర్శ కుడు బి గోపాల్ దర్శకత్వంలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక తాజాగా నమ్రత షేర్ చేసిన ఈ ఫోటోలో సరిగ్గా 14 సంవత్సరాల క్రితం తన తండ్రి మరణించిన ఈ విష యాన్ని గుర్తు చేస్తూ, లవ్ యూ పాప వీ మిస్ యూ సో మచ్ అంటూ పేర్కొంది.