తల్లి పాలు బాగా పెరగాలంటే…ఈ చిట్కా ఫాలో అవ్వండి
How to Increase Breast Milk :మహిళలు గర్భిణీగా ఉన్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రసవమయ్యాక కూడా అంతకంటే ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. బిడ్డను కనగానే ఎన్నో రకాల ఇన్‌ఫెక్షన్లూ, వ్యాధులూ ఆ బిడ్డపై దాడికి సిద్ధమవుతాయి. వాటి నుంచి బిడ్డను కాపాడుకునే శక్తి తల్లికి ఉంటుంది. తన పాల ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొవ్వులూ, చక్కెర్లూ, నీళ్లూ, మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ప్రతి బిడ్డకూ తల్లిపాలు చాలా అవసరం. అయితే కొందరు తల్లుల్లో పాలు చాలా తక్కువగా ఉంటాయి
ఉదయం లేచిన వెంటనే నానబెట్టిన మెంతులను తినాలి . వీటిలో కాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి లాక్టేటింగ్ హార్మోన్లను పెంచుతాయి. దాంతో బిడ్డకు సరిపడా పాలు తల్లి దగ్గర ఉంటాయి.
బాలింతలకు మెంతుల కషాయం, మెంతి కూర పప్పు ఎక్కువగా తినిపిస్తే పాలు ఉత్పత్తి పెరుగుతుంది. తల్లిపాలు తాగే ఎవరైనా సరే ఆరోగ్యంగా పెరుగుతారు. బాలింతలకు మెంతులతో తయారు చేసిన పదార్థాలను పెడుతూ ఉండాలి