నిజ జీవితంలో కార్తీక దీపం సౌందర్య, కార్తీక్ మధ్య వయసు తేడా ఎంతో…?
Karthika Deepam :కార్తీకదీపం సీరియల్ మొత్తం సిరియల్స్ అన్నింటిలోకి నెంబర్ వన్ సీరియల్ గా కొనసాగుతుంది టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతోంది ఈ సీరియల్ కి సంబంధించిన ఏ విషయం తెలిసిన అభిమానులు ఆనందపడతారు కార్తీకదీపం సీరియల్లో కార్తీక్ గా నటించిన నిరుపమ్ కార్తీక్ తల్లి సౌందర్య గా నటించిన అర్చన మధ్య వయసు తేడా ఎంత ఉందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. తల్లి కొడుకులగా నటిస్తున్న నిరుపమ్ అర్చన ల మధ్య వయసు తేడా ఎంత ఉందో చూద్దాం.
కర్ణాటక లో పుట్టి పెరిగిన అర్చన సీరియల్స్ కి రాకముందు బ్యూటిషియన్ గా పని చేసేవారు. ఆమె బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకున్నాక సీరియల్స్ నటిస్తున్నారు. ఈమె 1988 జనవరి 3న జన్మించారు ఆమె వయసు 33 సంవత్సరాలు.వెండితెరపై కూడా థ్యాంక్యు బ్రదర్‌లో ఎంట్రీ ఇచ్చారు.
ఇక ఓంకార్ కొడుకు అయిన పరిటాల నిరుపమ్ కూడా 1988లో ఫిబ్రవరి 15న జన్మించాడు. తన సహనటి మంజుల ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కార్తీక దీపం సీరియల్లో తల్లీకొడుకులుగా నటిస్తున్నప్పటికీ.. నిజ జీవితంలో కార్తీక్, సౌందర్యల మధ్య వయసు వ్యత్యాసం 43 రోజులు మాత్రమే. అయినప్పటికీ.. వయసు మించిన పాత్రలో కార్తీక్‌కి తల్లిగా సౌందర్య అంటే అర్చన అదరగొట్టేస్తున్నారు.