MoviesTollywood news in telugu

ఎఫ్ 3లో మూడో హీరో ఎవరంటే…ఎవరు ఊహించని హీరో

F3 Heroes : అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఎఫ్ 2 సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో లో వెంకటేష్ వరుణ్ తేజ లతో పాటుగా మరో హీరో నటిస్తున్నాడు ఆ హీరో గురించి చాలా ఊహాగానాలు వచ్చాయి

ఇప్పుడు ఆ హీరో ఎవరో తెలిసిపోయింది. మొదట రవితేజ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి ఆ తర్వాత రామ్,సాయి ధరమ్ తేజ్ అంటూ ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడనే వార్త వచ్చింది.

గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వం లో కళ్యాణ్ రామ్ పటాస్ సినిమా చేశాడు. ఆ పరిచయంతో కళ్యాణ్ రామ్ చేయడానికి ముందుకు వచ్చాడట అంతేకాకుండా అనిల్ రావిపూడి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశాడట. ఈ సినిమా ఆగస్టు 27న విడుదలకు సిద్ధం అవుతోంది. చివరి 10 నిమిషాల్లో ఫుల్ ఫన్ క్రియేట్ చేయడంతో పాటు ఇద్దరు హీరోలను ఇరుకున పెట్టే క్యారెక్టర్ చేస్తున్నట్టు తెలిసింది.