సౌందర్య చేసిన చిన్న తప్పు ఆమెను బలి చేసిందా..?
Telugu actress soundarya :తెలుగు సినిమా రంగంలో తారాజువ్వలా ఎగిసిపడి, అంతలోనే అంతర్ధానమైన స్టార్ హీరోయిన్ సౌందర్య తెలుగు ఆడియన్స్ మదిలో ఎప్పటికీ గుర్తిండిపోతుంది. అమ్మోరు లాంటి సినిమాలు ఆమె కెరీర్ ని మలుపు తిప్పాయి. ఇక సూపర్ స్టార్ కృష్ణతో అప్పట్లో దర్శకుడు చిట్టిబాబు రైతు భారతం అనే సినిమా తీయడానికి రెడీ అయ్యారు. మొదటి హీరోయిన్ గా వాణి విశ్వనాథన్ ని తీసుకున్నారు. సెకండ్ హీరోయిన్ గా మంచి నటిని సెలక్ట్ చేయాలన్న ఉద్దేశ్యంతో చాలామందిని చూస్తుండగా, అప్పట్లో ఎడిటర్ గా పనిచేస్తున్న రామయ్య వెంటనే డైరెక్టర్ చిట్టిబాబు కి ఫోన్ చేసి మీకు కావాల్సిన నటి బెంగళూరులో ఉందని చెప్పారు. అయితే చిట్టిబాబు ఎవరికి ఏమీ చెప్పకుండా నేరుగా ఆమె ఇంటికి వెళ్లారు. మేకప్ లేకుండా ఉన్న ఆమెను చూసి ఆనందపడ్డారు.
ఇక ఆలస్యం చేయకుండా వెంటనే పేమెంట్ ఇచ్చేసి తన సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేసేసారు. అలా సౌందర్య ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ టైమ్ లోనే చిట్టిబాబు, సౌందర్య తండ్రి కే.ఎస్ సత్యనారాయణను కూడా కలిశారు. నిజానికి సౌందర్య తండ్రి జాతకాలు చెప్పేవారు. చిట్టిబాబు వచ్చినప్పుడు.కే.ఎస్ సత్యనారా యణ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ “నా కూతురికి సినిమా అవకాశాలు ఇలా వస్తున్నా యేంటి?” అని ఆమె జాతకం చూసి, 10-12 ఏళ్ళు మాత్రమే సినిమాల్లో రాణించ గలదని చెప్పారు. అయితే అప్పట్లో ఆయన చెప్పిన జాతకం విని 10-12 ఏళ్ల తరువాత సౌందర్య సినీ కెరీర్ పతనం అవుతుందేమోనని అనుకున్నారేగాని, ఆమె చనిపోతుందని అనుకోలేదు.
సౌందర్య ని తీసుకొని చెన్నై తీసుకెళ్లి విజయగార్డెన్స్ లో షూటింగ్ ప్రారంభించారు. అయితే షూటింగ్ స్టార్ట్ చేసే ముందు తన డైరెక్షన్ లో తీసే మూడు సినిమాల్లో నటించాలని సౌందర్య చేత చిట్టిబాబు ఒప్పందం చేసుకున్నారు. అలాగని, ఇతర డైరెక్టర్స్ నుంచి ఆఫర్స్ వస్తే, చిట్టిబాబు కాదనలేదు. పైగా ఎంకరేజ్ చేసారు. దీంతో ఆమె సినిమాలు హిట్ మీద హిట్ కొడుతూ అమాంతం స్టార్ హీరోయిన్ అయింది. సౌందర్య మరణించే ముందు డైరెక్టర్ చిట్టిబాబు గెలుపు అనే సినిమాని తీశారు.ఈ మూవీలో సౌందర్య ఓ అతిధి పాత్రను పోషించారు.అయితే స్టార్ హీరోయిన్ అయ్యి ఉండి.ఓ గెస్ట్ రోల్ లో నటించడమేంటి.అని అప్పట్లో మీడియా జర్నలిస్టులు సౌందర్య ని ప్రశ్నించారు.వారి ప్రశ్నలకు సమాధానమిస్తూ.
చిట్టిబాబు చేసిన సాయానికి గెలుపు మూవీలో ఓ పాత్రలో నటించి ఋణం తీర్చుకున్నట్లు సౌందర్య అప్పట్లో చెప్పింది. సౌందర్య మరణించాక, చిట్టిబాబు ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొని, ప్రతిసారి సౌందర్య గురించి తలుచుకొని కంటతడి పెట్టుకునేవారు. సౌందర్య తన ఫామిలీ మెంబర్ గా అయన ఫీలయ్యే వారు. ఆమె బీజేపీ తరుపున ప్రచారం చేయాలని చిట్టిబాబే ఒప్పించినట్లు ఓ ఇంటర్వ్యూ లో చిట్టిబాబు చెప్పారు. ఆమె బెంగళూరు నుంచి హైదరాబాద్ కి స్పెషల్ హెలికాఫ్టర్ లో నల్గొండ వెళ్లి ప్రచారం చేసి, అనంతరం ఆమె హైదరాబాద్ వెళ్లి అక్కడ నుండి చెన్నై లో షూటింగ్ కి రావాలి. అయితే ఆ టైమ్ లోనే ఆమె కోసం బుక్ చేసిన హెలికాప్టర్ ఉత్తరప్రదేశ్ లీడర్ ములాయం సింగ్ యాదవ్ దగ్గర ఉండిపోవడంతో సౌందర్యకి చిట్టిబాబు ఫోన్ చేసి జెట్ ఎయిర్వేస్ లో హైదరాబాద్ కి రావాలని కోరారు.
హైదరాబాద్ నుంచి తన కారులో నల్గొండ ప్రచారానికి వెళ్లొచ్చని చిట్టిబాబు చెప్పారు. దీనికి సౌందర్య ఒకే చెప్పింది. అయితే ఆమె సోదరుడు అమర్నాథ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన ఫ్రెండ్ కి ఓ హెలికాప్టర్ ఉందని, దానికి ఎన్ఓసి కూడా ఉందని, అందులోనే వెళ్ళిపోవచ్చని సౌందర్య కి చెప్పడంతో సౌందర్య అదే హెలి కాప్టర్ లో హాయ్ గా వెళ్లిపోవచ్చని భావించింది. తీరా ఆ హెలికాప్టర్ కి కేవలం 2 సీట్ కెపాసిటీ మాత్రమే ఉండడంతో సౌందర్య, అమర్ నాథ్ పైలెట్ కూడా హెలికాప్టర్ ఎక్కడం, పైగా సౌందర్య తన లగేజి కూడా ఎక్కించడంతో అలా లోడ్ ఎక్కువై, హెలికాప్టర్ కాస్త ఎత్తు ఎగరగానే వెంటనే కిందపడి క్షణాల్లోనే కాలి బూడిదయ్యింది. ఈ ప్రమాదంలో సౌందర్య, అమర్నాథ్ అక్కడిక్కడే చనిపోయారు. అయితే సౌందర్య మరణానికి పరోక్షంగా తానే కారణమని చిట్టిబాబు కుమిలిపోతుంటారు.