MoviesTollywood news in telugu

మన స్టార్ హీరోల ఫిట్ నెస్ వెనక గల వ్యక్తులెవరో ఎవరో తెలుసా ?

Tollywood Heros Fitness Trainers :దేశముదురు సినిమాకోసం అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ బాడీ పెంచినా, జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ కోసం బాడీ ఫిట్ నెస్ చేసుకున్నా, ఇలా మన స్టార్ హీరోలెవరు అయినా సరే, ఇలా ఫిట్ నెస్ పాటించడం వెనుక ఓ కీలక ఫిట్ నెస్ ట్రైనర్స్ చెప్పినట్లే వినాలి. స్టార్ హీరోలు ఇందుకోసం చాలా కష్టపడుతున్నారు. దృవ మూవీలో రామ్ చరణ్ అద్భుతంగా బాడీ మలుచుకోవడంలో ఫిట్ నెస్ ట్రైనర్ రాకేష్ వడియార్ కృషి చెప్పలేనిది.

సుల్తాన్ , దంగల్ మూవీస్ లో సల్మాన్ ఖాన్ కి రాకేష్ ఫిట్ నెస్ ట్రైనర్ గా చేసాడు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ లో అల్లూరి సీతారామరాజు గెటప్ లో రామ్ చరణ్ కనిపిస్తాడు. రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో తన ఫిట్ నెస్ లెవెల్స్ టీజర్ లో చూపించి ఔరా అనిపించాడు. ఫిట్ నెస్ ట్రైనర్ రాకేష్ వడియార్ ట్రైనింగ్ కారణంగానే రామ్ చరణ్ అలా మారాడని అంటున్నారు. ఇదే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా కొమరం భీం గా సరికొత్త బడీ లుక్ తో వావ్ అనిపిస్తున్నాడు.

అయితే తారక్ కి ఫారిన్ ఫిట్ నెస్ ట్రైనర్ లారెస్ట్ స్టీవెన్స్ శిక్షణ ఇస్తున్నాడు. మణికట్టుకి గాయం కారణంగా కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ తర్వాత రెగ్యులర్ గా శిక్షణలో పాల్గొంటూ ఫిట్ నెస్ పెంచుకుంటున్నాడు. ఇటీవల ఓ పోస్ట్ చేయగా, అందులో ఎంత కష్టమైన శిక్షణ పొందుతున్నాడో అర్ధం అవుతుంది. ఇక ఫైటర్ మూవీలో విజయ్ దేవరకొండ ఫిట్ నెస్ కోసం చాలా కష్టపడుతున్నాడు. థాయ్ ల్యాండ్ లో 15మంది దగ్గర మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. గని సినిమాకు ఇంగ్లాండ్ కి చెందిన ట్రైనర్ దగ్గర వరుణ్ తేజ్ శిక్షణ తీసుకుంటున్నాడు.