ఉప్పెన ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో వైరల్ అవుతున్న చిరు కామెంట్స్
UPPENA PRE RELEASE EVENT :ఉప్పెన ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఉప్పెన సినిమా ఈనెల 12వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో చిరంజీవి మేనల్లుడు సాయి ధరంతేజ్ తమ్ముడు వైష్ణవి హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
ఈ ఈవెంట్ కి . మెగాస్టార్ చిరంజీవి, విజయ్ సేతుపతి, డైరెక్టర్లు సుకుమార్, బాబి సహా సినీ యూనిట్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మీమ్స్ చేసేవారికి పరోక్షంగా సెంటైర్లు వేశారు.
చిరు తనకు తెలియకుండానే తన సినిమాలో సీక్రెట్స్ బయట పెట్టేస్తూ ఉంటారు. అలాగే ఉప్పెన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చిరు సినిమాకి సంబందించి సీక్రెట్స్ చెప్పేస్తారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
చిరు మైక్ పట్టుకొని తాను ఎలాంటి లీకులు చేయను అంటూనే ఇందులో ఓ డేంజర్ పార్ట్ ఉంది.. అంటూ వెంటనే ఆపేసి…సుకుమార్ తో భయపడకు లీక్ చేయను అని అన్నారు చిరు.