MoviesTollywood news in telugu

హీరో వేణు ఇప్పుడు ఏ రంగంలో బిజీగా ఉన్నాడో తెలుసా?

Telugu Actor Venu :స్వయంవరం సినిమాతో రాకెట్ లా దూసుకువచ్చిన హీరో వేణు. ఈ సినిమాలో హీరోయిన్ గా లయ నటించింది. వీరిద్దరికి ఇదే మొదటి సినిమా. స్వయంవరం సినిమా హిట్ కావటంతో చాలా తక్కువ సమయంలోనే మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కుటుంబ కథ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయినా వేణు కామెడీ సినిమాలతో కూడా అభిమానులను అలరించాడు. సోలో హీరోగా అవకాశాలు తగ్గినప్పుడు మల్టీ స్టారర్ సినిమాలలో కూడా నటించాడు. ఈ మధ్య సినిమాల్లో కనిపించటం లేదు. వేణు 1976 జూన్ 4 న జన్మించాడు. వేణు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాడు. అయితే ఇంజనీరింగ్ చదివే సమయంలో సినిమాల్లో నటించాలనే కోరిక కలిగింది. దాంతో ఇంజనీరింగ్ పూర్తి కాగానే చేన్నై వెళ్లి ప్రయత్నాలను మొదలు పెట్టాడు. వేణు ప్రయత్నాలు ఫలించి ఎంతో మందిని వెండితెరకు పరిచయం చేసిన భారతీరాజా సినిమాలో హీరోగా అవకాశాన్ని సంపాదించాడు.

అయితే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఇక ఆ తర్వాత వేణు హైదరాబాద్ వచ్చేసి స్నేహితుడైన వెంకట శ్యామ్ ప్రసాద్ తో కలిసి ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ అనే సినీ నిర్మాణ సంస్థ స్థాపించాడు. ఆ సంస్థ సారథ్యంలో కె.విజయ భాస్కర్ దర్శకత్వంలో 1999లో వచ్చిన స్వయంవరం అనే సినిమా వేణు తొలి సినిమా. ఇందులో లయ కథానాయికగా నటించింది. లయకు కూడా ఈ సినిమా మొదటిది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. దాంతో వేణుకు మరిన్ని అవకాశాలు వచ్చాయి.

పెళ్ళాం ఊరెళ్లితే సినిమా వేణుకి మంచి పేరును సంపాదించి పెట్టింది. ఖుషి ఖుషీగా,యమగోల మొదలైంది సినిమాలతో తన కెరీర్ గ్రాఫ్ ని బాగా పెంచుకున్నాడు వేణు. కొత్తగా వచ్చే హీరోల పోటీని తట్టుకోలేక ఒకానొక దశలో క్యారెక్టర్ రోల్స్ కూడా వేసాడు. దమ్ము సినిమాలో ఎన్టీఆర్ బావగా నటించాడు.

ప్రకాష్రాజ్,సీనియర్ నరేష్,రావు రమేష్ వంటి వారు అన్ని రకాల పాత్రలను పోషించటంతో ఆ క్యారెక్టర్ రోల్స్ కూడా వేణుకి తగ్గిపోయాయి. ఆ తర్వాత రామాచారి సినిమాతో హీరోగా మరొక ప్రయత్నం చేసాడు. అయితే ఆ ప్రయత్నం విఫలం కావటంతో సినిమాలకు గుడ్ బై చెపేప్సాడు.

వేణుకి 2001 లోనే వివాహం అయింది. వేణు భార్య అనుపమ చౌదరి చెన్నైకి చెందిన అమ్మాయి. వీరికి ఇద్దరు పిల్లలు. MBA చదివిన అనుపమ పెళ్లి తర్వాత వేణుతో కలిసి వ్యాపార రంగంలో బిజీ అయింది. అనుపమ Scrapbooking అనే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది.

Scrapbooking అంటే ఒక వ్యక్తి జీవితంలోని ముఖ్య ఘట్టాలను చిత్ర రూపంలో అందంగా ఒక ఆల్బమ్ గా రూపొందించటం. ఇప్పుడు సెలబ్రెటీ కుటుంబాలలో ఈ Scrapbooking కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. భార్యతో కలిసి Scrapbooking వ్యాపారంలోకి దిగిన వేణుకి సినీ,పొలిటికల్,బిజినెస్ రంగాలకు చెందిన చాలా మంది ప్రముఖులు కస్టమర్స్ గా ఉన్నారు. అయితే మంచి పాత్రలు వస్తే నటించటానికి సిద్ధంగా ఉన్నాడు వేణు.