మీనా భర్త ఏమి చేస్తుంటారో తెలుసా…నెల సంపాదన ఎంతో…!?
Telugu actress Meena :చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మీనా పెద్దయ్యాక స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. వాస్తవానికి తమిళ సినిమా పరిశ్రమకి చెందినప్పటికీ, హీరోయిన్ గా తెలుగులో అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమా అవకాశాలు తగ్గుతున్న సమయంలో నెలకి లక్షల రూపాయల జీతాన్ని అందుకుంటున్న విద్యా సాగర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని, చెన్నైలో సెటిల్ అయింది. గతంలో పలు దేశాల ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థలలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా విద్యాసాగర్ పని చేశాడు.
వీరికి నైనిక విద్యాసాగర్ అనే ఒక పాప ఉంది. పెళ్లయ్యాక కొంత గ్యాప్ ఇచ్చిన మీనా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి దుమ్మురేపుతోంది. ఆ మధ్య తెలుగులో ప్రముఖ హీరో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన “దృశ్యం” చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. దీంతో ప్రస్తుతం మీనా వరుస ఛాన్స్ లతో బిజీ అయ్యింది. అలాగే మలయాళం ప్రముఖ దర్శకురాలు రాణి జార్జ్ దర్శకత్వం లో దృశ్యం సీక్వెల్ గా “దృశ్యం 2” మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మలయాళ రీమేక్ లూసిఫర్ లో కూడా మీనా కీలక పాత్రలో నటిస్తున్నట్లు పలు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా క్లారిటీ లేదు. సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో అక్కినేని మానవరాలిగా మెప్పించిన మీనా ఎక్స్ పోజింగ్ పాత్రలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలతో సినిమా ప్రేక్షకులకు దగ్గరైంది. కాగా తమిళ తలపతి విజయ్ హీరోగా నటించిన పోలీసోడు (తెలుగు డబ్బింగ్) మూవీలో హీరో డాటర్ పాత్రలో మీనా కూతురు ‘నైనిక’ నటించి, తొలి చిత్రంతోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరించింది. సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు సైతం అందుకుంది.