30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాకి ఎంత లాభం వచ్చిందో తెలుసా?
30 rojullo preminchadam ela movie collections :టాలీవుడ్ టాప్ యాంకర్ ప్రదీప్ హీరోగా మున్నా దర్శకత్వంలో వచ్చిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదు అనిపించుకుంది. గత సంవత్సరమే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో లో నీలి నీలి ఆకాశం అనే పాట సినిమాకి మంచి హైప్ తీసుకు వచ్చింది.
దాంతో ఈ సినిమా పది కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. సినిమా బ్రేక్ ఈవెన్ అమౌంట్ కేవలం 5.5 కోట్లు మాత్రమే. మిగిలినది అంతా లాభమే. ప్రముఖ ఓటీటీ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు రైట్స్ ను కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది.ఓటీటీ సంస్థ ఎంతకు కొనుగోలు చేసిందో ఇంకా తెలియలేదు. ఏది ఏమైనాఇది అదనమే కదా.
మొదటి వారం కలెక్షన్స్ బాగానే ఉన్నాయి ఆ తర్వాతే కలెక్షన్స్ తగ్గాయి. ఈ సినిమా తర్వాత ప్రదీప్ హీరోగా నటిస్తాడని లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో నటించిన అమృత అయ్యర్ కి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన శాటిలైట్ స్ట్రీనింగ్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.