సుమలత తండ్రి ఏమి చేస్తారో తెలుసా…ఆమె భర్త స్టార్ హీరోనే…ఎవరో..?
Telugu Actress Sumalatha :చిరంజీవితో శుభలేఖ,ఖైదీ వంటి హిట్ సినిమాలను చేసిన సుమలత గురించి ఈ తరం వారికి చాలా తక్కువే తెలుసు.తెలుగు,తమిళ,కన్నడ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించింది సుమలత. ఇప్పుడు సుమలత గురించి వివరంగా తెలుస్కుందాం. సుమలత 1963 ఆగస్టు 27 న మద్రాస్ లో పుట్టింది. ఆమె తండ్రి మదన్ మోహన్,తల్లి రూప మోహన్. తండ్రి ఉద్యోగ రీత్యా సుమలత ముంబై,ఆంధ్రప్రదేశ్ లలో పెరిగింది. సుమలతకు ఆరు భాషలు వచ్చు. గుంటూరు లో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గి, తన 15 వ ఏటా సినిమా రంగంలో ప్రవేశించింది. సుమలత తెలుగు సినిమాలే కాకుండా తమిళ,కన్నడ,మలయాళ,హిందీ సినిమాలలో నటించింది.
విజయ్ చందర్ హీరోగా బాలు దర్శకత్వంలో వచ్చిన రాజా ది రాజా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణతో సమాజానికి సవాల్ సినిమాలో నటించి స్టార్ డమ్ తెచ్చుకుంది.
సినిమా రంగంలో దాదాపుగా 11 సంవత్సరాలు పనిచేసి డిసెంబర్ 8 1992 లో సహనటుడు అంబరీష్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సుమలత బెంగుళూర్ లో స్థిరపడింది.
సుమలత, అంబరీష్ తో కలిసి ఆహుతి,అవతార పురుషుడు, శ్రీ మంజునాథ వంటి సినిమాల్లో నటించింది. సుమలత,అంబరీష్ దంపతులకు అభిషేక్ అనే ఒక కొడుకు ఉన్నాడు. సినిమాలకు చాలా కాలం దూరంగానే ఉండిపోయింది.
2006 లో నాగార్జున హీరోగా వచ్చిన బాస్ సినిమాలో కీలకమైన పాత్రను పోషించింది. మోహన్ బాబు గేమ్ సినిమాలో జడ్జి పాత్రను పోషించింది. ఆలా అడపా దడపా సినిమాల్లో నటిస్తూ సందడి చేస్తూ ఉంది.
సుమలత వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా సందడి చేసింది. జీ తెలుగులో వచ్చిన బతుకు జట్కా బండి అనే సామజిక కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ప్రస్తుతం కన్నడ రాజకీయాల్లో కూడా తనదైన పాత్రను పోషించటానికి సిద్ధం అవుతుంది.