నక్క తోక తొక్కిన దుర్గారావ్…. ఎంత పెద్ద ఆఫర్ వచ్చిందంటే
tiktok durga rao :తెలుగులో లో బిగ్ బాస్ నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది నాలుగు సీజన్ లు దాదాపుగా హిట్ అయ్యాయి. ఇక సీజన్ 5 ఆగస్టు నుంచి ప్రసారం అవుతుంది అనే ప్రచారం సాగుతోంది సీజన్ 5 కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తారని, పార్టిసిపేట్ ల ఎంపిక కూడా ప్రారంభం అయిందని జోరుగా వార్తలు వస్తున్నాయి.
ఈ సీజన్లో టిక్ టాక్ దుర్గారావు కంటెస్టెంట్ గా ఉండబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అంతటి పాపులారిటీ సంపాదించుకున్నారు దుర్గారావు. క్రాక్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు. టిక్ టాక్ దుర్గారావు బిగ్బాస్ సీజన్ 5 లో ఉంటే కనుక అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. సీజన్ 4 లో పెద్దగా ఫేమ్ లేని సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ సీజన్ ఫైవ్ లో పాపులారిటీ ఉన్నా సెలబ్రిటీలకు తీసుకోవాలని బిగ్బాస్ నిర్వాహకులు అనుకుంటున్నారు.
అంతేకాకుండా షణ్ముఖ్ జశ్వంత్, హైపర్ ఆది కూడా బిగ్ బాస్ సీజన్ 5 లో ఉంటున్నారనే వార్తా కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది.