Beauty Tips

బాదం ఆయిల్ లో ఇవి కలిపి రాస్తే మెరిసే ముఖం మీ సొంతం

Almond In Telugu :బాదం నూనె గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు బాదం పప్పు నుండి తయారయ్యే ఈ నూనెలో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ ఈ విటమిన్ డి మరియు యాంటి ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. బాదం నూనె ఎన్నో చర్మ ప్రయోజనాలను అందిస్తుంది అయితే ఈ నూనెను ఎలా ఉపయోస్తే ఎలాంటి చర్మ సమస్యలు తొలగి పోతాయో తెలుసుకుందాం.

ఒక స్పూన్ బాదం నూనెలో ఒక స్పూన్ పాలు వేసి బాగా కలిపి ముఖానికి రాసి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంటయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముడతలు అన్ని తొలగిపోతాయి చర్మం మృదువుగా మారుతుంది. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తే మంచి ఫలితం ఉంటుంది

ఒక స్పూన్ బాదం నూనెలో ఒక స్పూన్ గ్రీన్ టీ వేసి బాగా కలిపి మొఖానికి పట్టించి అరగంటయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలు నల్లని మచ్చలు అన్ని తొలగిపోతాయి అంతేకాకుండా మృతకణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.