MoviesTollywood news in telugu

ఈ విలన్ ని గుర్తు పట్టారా…ఎలా చనిపోయాడో తెలుసా?

Tollywood Actor Manik Irani :ఈ విలన్ ని చూడగానే మనకు మెగాస్టార్ తో చేసిన ఫైట్స్ గుర్తుకు వస్తాయి. అప్పట్లో పులి రాజు పాత్రలో చాలా బాగా పాపులర్ అయ్యాడు. రాజా విక్రమార్క సినిమాలో ‘లోగ్ ముజే బిల్లా కెహతే హై.. బ్యాగ్ లేలో’ అంటూ ఒక ప్రత్యేకమైన  డైలాగ్ కూడా ఉంది. ఈ విలన్ కి చిరు సినిమాల్లో ప్రత్యేకమైన ఫైట్స్ కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ విలన్ పేరు ఏమిటా అని ఆలోచిస్తున్నారా…అతనే మాణిక్ ఇరానీ. మాణిక్ ఇరానీని సినిమా వాళ్ళు బిల్లా అని పిలుస్తూ ఉంటారు. 80-90 దశకంలో సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ తో పాటు హీరోలతో ఫైట్స్ కూడా చేసేవాడు.

అయితే 90 దశకంలో చనిపోయాడు. అయితే మాణిక్ ఇరానీ ఎలా చనిపోయాడో ఎవరికీ క్లారిటీ లేదు. కొంత మంది విపరీతంగా మద్యం త్రాగటం వలన చనిపోయాడని….మరి కొంత మంది మద్యం అలవాటు ఎక్కువ అవటం వలన సినీ అవకాశాలు రాక ఆత్మహత్య చేసుకున్నాడని అంటూ ఉంటారు. మాణిక్ ఇరానీ చనిపోయినప్పుడు మెగాస్టార్ ఆ కుటుంబానికి సహాయం చేసాడనే వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి.