Healthhealth tips in telugu

బ్రకోలీ వారంలో రెండు సార్లు తింటే ఏమి అవుతుందో తెలుసా?

Broccoli Health Benefits in Telugu :బ్రకోలీ గురించి మనలో చాలా మందికి తెలియదు. ఈ మధ్యకాలంలో సూపర్ మార్కెట్స్ లో దొరకటం వలన కొంతమందికి తెలిసింది.బ్రకోలీలో ఉన్న పోషకాలు,ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే అసలు వదిలిపెట్టకుండా తింటారు. వారంలో రెండు సార్లు బ్రకోలీని ఆహారంలో బాగంగా చేసుకుంటే సరిపోతుంది.

బ్రకోలీలో విటమిన్ సి, జింక్, కాపర్, బి విటమిన్లు, ప్రోటీన్, ఫైబర్, పొటాషియం, విటమిన్ కె వంటి సూక్ష్మ పోషకాలు సమృద్దిగా ఉంటాయి. కాల్షియం అయితే పాల ఉత్పత్తుల కన్నా ఎక్కువ మోతాదులో ఉంటుంది.

ఈ కూరగాయ ఆకుపచ్చ రంగులో ఉండటం వలన ఆకుపచ్చని కూరల్లో ఉండే సల్ఫోరాఫేన్ అనే ఫైటోకెమికల్ దీనిలో చాలా సమృద్దిగా ఉంటుంది. ఇది శరీరం నుండి మలినాలను బయటకు పంపుతుంది.

బ్రకోలీలో ఉండే ఇండోల్-3 కార్బినోల్, కెంప్ఫెరాల్ వంటి సమ్మేళనాలు మంట,వాపు నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన డయబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. దీనిలో ఉండే ఉండే క్వెరెసిటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తూ, గుండె సంబంధ అనారోగ్యాలను దూరం చేస్తాయి.

బ్రకోలీని సరిగ్గా శుభ్రం చేసిన తరువాతే వంటల్లో వాడాలని,బాగా ఉడికించి మాత్రమే వంటల్లో వాడాలని నిపుణులు చెప్పుతున్నారు.