బుల్లితెరను ఏలుతున్న పరభాష నటులు ఎంతమంది ఉన్నారో…?
Television Actress :టీవిలో వచ్చే సిరియల్స్ చూసే వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. సినిమాల కన్నా సిరియల్స్ చూసి ఆ నటులను తమ అభిమాన నటులుగా మార్చుకున్న వారు చాలా మందిఉన్నారు. వారి గురించి ఏ వివరం వచ్చిన చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఈ రోజు మన సిరియల్స్ లో నటించే నటుల ఊర్ల వివరాలు తెలుసుకుందాం.
కార్తీకదీపం సీరియల్ లో వంటలక్కగా ఫేమస్ అయిన ప్రేమి విశ్వనాథ్ సొంత ఊరు కేరళ
కార్తీక దీపం సీరియల్ లో కార్తిక్ తల్లిగా నటించిన అర్చన సొంత ఊరు కర్నాటక
కార్తీక దీపం సీరియల్ లో విలన్ మౌనితగా అందరినీ మెప్పిస్తోన్న శోభా శెట్టి సొంత ఊరు కర్నాటక
ఆమె కథ సీరియల్ లో నటిస్తున్న నవ్య స్వామి సొంత ఊరు కర్నాటక
అగ్ని సాక్షి, కస్తూరి సీరియళ్లలో అందరినీ ఆకట్టుకున్న ఐశ్వర్య పిస్సె సొంత ఊరు కర్నాటక
వదినమ్మ సీరియల్ లో నటిస్తున్న సుజిత సొంత ఊరు కేరళ
గృహ లక్ష్మి సీరియల్ లో నటిస్తున్న కస్తూరి సొంత ఊరు తమిళనాడు
మౌనరాగం సీరియల్ లో నటించిన ప్రియాంక జైన్ సొంత ఊరు ముంబై
రక్త సంబందం సీరియల్ లో నటిస్తున్న మేఘన లోకేశ్ సొంత ఊరు కర్నాటక